లండన్ పర్యటనలో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు తో ఎన్నారై బీఆర్ఎస్ యూకే ప్రతినిధులు భేటీ అయ్యారు. వెస్ట్ లండన్లో మాజీ మంత్రితో శుక్రవారం ” మీట్ & గ్రీట్ ” కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి యూకేలోని ఎన్నారైలు, హరీష్ రావు అభిమానులు భారీగా తరలి వచ్చారు. ఎన్నారై బీఆర్ఎస్ యూకే అధ్యక్షుడు నవీన్ రెడ్డి నాయకత్వంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్యనాయకులు రవి ప్రదీప్ పులుసు, సురేష్ గోపతి అధ్యక్షత వహించారు.

