రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజే రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) చీఫ్ మోహన్ భగవత్‌తో రహస్యంగా సమావేశమయ్యారు. ఈ ప్రత్యేక భేటీ సుమారు 20 నిమిషాలు కొనసాగింది. జోధ్‌పూర్‌లో రెండు రోజుల పర్యటనలో ఉన్న బీజేపీ సీనియర్ నాయకురాలు వసుంధర రాజే, గురువారం రామ్‌డియోరా మందిరానికి వెళుతూ లాల్ సాగర్ ప్రాంతంలోని ఆదర్శ్ విద్యా మందిర్‌లో మోహన్ భగవత్‌ను కలిశారు. కొంత కాలంగా బీజేపీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్న. నేపథ్యంలో ఆకస్మికంగా మోహన్ భగవత్‌ను ప్రత్యేకంగా కలుసుకోవడం రాజకీయ వర్గాల్లో కలకలం రేపింది.

