తెలంగాణలో కాంగ్రెస్ పాలన చేతగానిదని, ప్రజలకు క్షమాపణ చెప్పాలని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. ఎర్రవల్లిలోని కేసీఆర్ నివాసంలో బాన్స్వాడ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నేతలు,
వందలాది కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణలో జరిగిన ఫిరాయింపులపై సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిందని, త్వరలో రాష్ట్రంలో ఉప ఎన్నికలు రావడం ఖాయమని కేటీఆర్ అన్నారు.

