loader

తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల మొదటి విడత నోటిఫికేషన్ విడుదల

తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగింది. మొదటి విడతకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మేరకు అధికారులు ప్రత్యేక ప్రకటన చేశారు. మొదటి దశలో 292 జడ్పీటీసీ, 2, 963 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. దీనికి ఇవాళ్టి నుంచి నామినేషన్లు స్వీకరించనున్నారు. మూడు రోజుల పాటు నామినేషన్లు స్వీకరిస్తారు. 12న వాటిని పరిశీలిస్తారు. 15 వరకు ఉపసంహరణకు అవకాశం ఉంటుంది. ఈ నెల 23న పోలింగ్ జరగనుంది. నవంబర్‌ 11న ఓట్ల లెక్కింపు ఉంటుందని […]

జూబ్లిహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ – అధికారికంగా ప్రకటించిన ఏఐసిసి

జూబ్లిహిల్స్ ఉపఎన్నికకు అభ్యర్థిగా నవీన్ యాదవ్ పేరును కాంగ్రెస్ పార్టీ ఖరారు చేసింది. ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి మొదటి నుంచి నవీన్ యాదవ్ ను అభ్యర్థిగా ప్రొజెక్ట్ చేస్తూ వచ్చారు. హైకమాండ్ అంగీకరించింది. జూబ్లిహిల్స్ లో చిన్న శ్రీశైలం యాదవ్ పేరు తెలియని వారు ఉండరు. సినీ ఇండస్ట్రీ మొత్తం ఆయనంటే భయంతో కూడిన గౌరవం ఇస్తుంది. అలాంటి ఇమేజ్ ఉన్న ఆయన కుమారుడే నవీన్ యాదవ్. బస్తీల్లో పట్టు ఉన్న కుటుంబం. ముస్లిం వర్గాల్లోనూ […]

అమిత్‌ షా ప్రధానిగా వ్యవహరిస్తున్నారు.. మోదీ జాగ్రత్తగా ఉండాలి: మమతా బెనర్జీ

పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాపై ఆమె మండిపడ్డారు. ప్రధాని మాదిరిగా ఆయన వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. మోదీ జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.అమిత్‌ షాను ‘యాక్టింగ్ పీఎం’ అని అభివర్ణించారు. ప్లాసీ యుద్ధంలో నవాబ్ సిరాజ్ ఉద్ దౌలాను మోసం చేసిన 18వ శతాబ్దపు బెంగాల్ సైనిక జనరల్ మీర్ జాఫర్‌తో అమిత్‌ షాను మమతా బెనర్జీ పోల్చారు.

లక్ష్మణ్‌కు మంత్రి పొన్నం ప్రభాకర్ క్షమాపణ..

తెలంగాణ మంత్రులు పొన్నం ప్రభాకర్ , అడ్లూరి లక్ష్మణ్ మధ్య వివాదం ముగిసింది. పీసీసీటీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ బుధవారం నాడు తన నివాసంలో ఇద్దరు మంత్రులతో సమావేశమయ్యారు. ఎట్టకేలకు మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కు మంత్రి పొన్నం ప్రభాకర్ క్షమాపణలు చెప్పారు. ‘లక్ష్మణ్ బాధ పడిన దానికి నేను క్షమాపణలు కోరుతున్న. లక్ష్మణ్‌కు వ్యక్తిగతంగా క్షమాపణలు చెప్తున్న. కరీంనగర్‌లో మాదిగ సామాజిక వర్గంతో నేను కలిసి పెరిగా’ అంటూ మంత్రి పొన్నం చెప్పుకొచ్చారు.

జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో పోటీపై టీడీపీ కీలక నిర్ణయం,

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలపై తెలుగుదేశం పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. పోటీగా దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నట్లు టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు తెలిపారు. ఎన్నికల్లో పోటీ చేసేందుకు అభ్యర్థులు సిద్ధంగా లేని కారణంగా పోటీ నుంచి టీడీపీ తప్పుకుంది. బీజేపీ తమ మద్ధతు కోరితే ఆలోచిస్తామన్నారు చంద్రబాబు. తెలంగాణ తెలుగుదేశం నేతలతో పార్టీ జాతీయ అధ్యక్షులు, ఏపీ సీఎం చంద్రబాబు మంగళవారం నాడు సమావేశం అయ్యారు.

అడ్లూరి తో నా అనుబంధం విడదీయరానిది.. మంత్రి పొన్నం ప్రభాకర్‌

మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌తో వివాదంపై పొన్నం ప్రభాకర్‌ స్పందించారు. అడ్లూరి తనకు సోదరుడిలాంటి వారని తెలిపారు. కాంగ్రెస్‌లో మాకు 30 ఏళ్ల స్నేహబంధం ఉందని అన్నారు. ఇద్దరి మధ్య ఉన్న అనుబంధం విడదీయరానిది అని అన్నారు. అడ్లూరి లక్ష్మణ్‌పై ఎలాంటి వ్యక్తిగత వ్యాఖ్యలు చేయలేదని స్పష్టం చేశారు.  కొందరు తన వ్యాఖ్యలను వక్రీకరించి ప్రచారం చేశారని అన్నారు. అడ్లూరి బాధపడ్డారని తెలిసి తీవ్రంగా విచారిస్తున్నానని అన్నారు. అడ్లూరి మనసు నొచ్చుకుని ఉంటే చింతిస్తున్నానని చెప్పారు.

ఏపీలో మెడికల్ కాలేజీల పీపీపీ మోడల్ పై తొలిసారి ఆందోళనలో పాల్గొనున్న జగన్!

ఆంధ్రప్రదేశ్‌లో మెడికల్ కాలేజీలను పీపీపీ మోడల్‌లో తీర్చిదిద్దాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీన్ని వైసీపీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. వైసీపీ ఇప్పుడు ఆందోళన బాట పడుతోంది. ప్రజలకు మేలు చేసే కాలేజీలను ప్రైవేటుపరం చేస్తోందని ఆరోపిస్తున్న జగన్ పార్టీ ఈ నెల పది నుంచి నిరసన కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించింది. అక్టోబరు 9న నర్సీపట్నం మెడికల్‌ కాలేజీని సందర్శించబోతున్నట్టు జగన్ ప్రకటించారు. మెడికల్‌ కాలేజీల పీపీపీ విధానాన్ని వ్యతిరేకిస్తూ ప్రతి పంచాయతీ నుంచి 500 మందితో సంతకాల సేకరించాలని టార్గెట్ […]

వైసీపీ డిజిటల్ బుక్‌ సీన్ రివర్స్… సొంత పార్టీ నేతలపైనే ఫిర్యాదులు…

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన డిజిటల్ బుక్‌లో కొన్ని చోట్ల సొంత పార్టీ నేతలపై ఫిర్యాదులు నమోదు అవుతుండటంతో వైసీపీకి ఇబ్బందికరంగా మారింది. ఇటీవల వైసీపీ ఆవిష్కరించిన డిజిటల్ బుక్‌లో విడదల రజినీపై ఫిర్యాదు అందింది. తాజాగా మడకశిర వైసీపీ మాజీ ఎమ్మెల్యే తిప్పేస్వామిపై వైసీపీ డిజిటల్ బుక్‌లోకి ఫిర్యాదు చేరింది మున్సిపల్ చైర్మన్‌ను చేస్తానంటూ రూ. 25 లక్షలు తీసుకున్నట్లు కౌన్సిలర్ ప్రియాంక, ఆమె తండ్రి విక్రమ్ డిజిటల్ బుక్‌లో ఫిర్యాదు చేశారు.

ఆఫ్రికాలో టిడిపి నేతలకు నకిలీ మద్యం తయారీలో శిక్షణ : పేర్నినాని

మందుబాబులకు కూడా ఎపి సిఎం చంద్రబాబు నాయుడు వెన్నుపోటు పొడిచారని వైసిపి మాజీ మంత్రి పేర్నినాని తెలిపారు. ఆఫ్రికా ఫార్ములా తెచ్చి ఎపిలో నకిలీ మద్యం తయారు చేస్తున్నారని అన్నారు. ఆఫ్రికాలో టిడిపి నేతలకు నకిలీ మద్యం తయారీలో శిక్షణ ఇస్తున్నారని, నకిలి మద్యం తాగి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దు అని నాని సూచించారు. డిప్యూటి సిఎం పవన్ కల్యాణ్ ఎన్నికల ముందు బయటకొస్తాడని, ఊగిపోతాడని, ఆడపిల్లలపై అఘాయిత్యాలు  జరుగుతుంటే కలుగులో నుంచి బయటకు రాడని పేర్నినాని […]

దున్నపోతు అంటావా?.. పొన్నం.. క్షమాపణ చెప్పాల్సిందే!

జూబ్లీహిల్స్‌లో జరిగిన మీటింగ్‌లో పొన్నం ప్రభాకర్ మరియు అడ్లూరి లక్ష్మణ్ మధ్య ఘర్షణ తారాస్థాయికి చేరింది. అడ్లూరి సమయానికి రాలేదని “దున్నపోతు” అంటూ అవమానించిన పొన్నం వ్యాఖ్యలు ఇప్పుడు పెద్ద రాజకీయ వివాదంగా మారాయి. “మాదిగ జాతిలో పుట్టానని నన్ను అవమానిస్తారా?” అంటూ అడ్లూరి ఆవేదన వ్యక్తం చేశారు. రేపటి వరకు క్షమాపణ చెప్పకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని వార్నింగ్ ఇచ్చారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON