loader

కరీంనగర్ జిల్లాలో 11 గంటల వరకు 46.39 శాతం పోలింగ్ నమోదు

కరీంనగర్ జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 11 గంటల వరకు 46.39 శాతం పోలింగ్ నమోదైంది. ఓటర్లు తమ ఓటు హక్కును వినిగియోగించుకునేందుకు బారులు తీరారు. వృద్ధులు సైతం పోలింగ్ కేంద్రాలకు చేరుకుని తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. చొప్పదండి(53.98), గంగధారా(45.16), కరీంనగర్ రూరల్(49.64), కొత్తపల్లి(46.19), రామడుగు(40.83) శాతం పోలింగ్ నమోదైంది. 91 గ్రామ పంచాయతీల్లో పోలింగ్ కొనసాగుతోంది.

రాజన్నసిరిసిల్ల జిల్లాలో 48.49 శాతం పోలింగ్ నమోదు

రాజన్నసిరిసిల్ల జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 11 గంటల వరకు 48.49 శాతం పోలింగ్ నమోదైంది. ఓటర్లు తమ ఓటు హక్కును వినిగియోగించుకునేందుకు బారులు తీరారు. వృద్ధులు సైతం పోలింగ్ కేంద్రాలకు చేరుకుని తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. చందుర్తి(41.06), కోనరావుపేట(52.19), రుద్రాంగి(46.04), వేములవాడ(53.23), వేములవాడ రూరల్(49.55) శాతం పోలింగ్ నమోదైంది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో 9 గంటల వరకు 17.46 శాతం పోలింగ్ నమోదైన విషయం తెలిసిందే.

సర్పంచ్ ఎన్నికకు బ్రేక్.. పోలింగ్‌ను బహిష్కరించిన గ్రామస్తులు

తెలంగాణలో తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. కామారెడ్డిలోని ఓ గ్రామంలో మాత్రం ప్రజలు ఎన్నికలను బహిష్కరించారు. జిల్లాలోని రామారెడ్డి మండలం చిన్న గోకుల్ తండా వాసులు ఎన్నికలను బహిష్కరించారు. తమకు సమాచారం ఇవ్వకుండా పెద్ద గోకుల్ తండా వాసులు సర్పంచ్‌ను ఏకగ్రీవం చేసుకున్నారని గ్రామస్తులు నిరసనకు దిగారు. పెద్ద గోకుల్ తండా వాసిని వేలం పాట ద్వారా ఏకగ్రీవం చేసుకున్నారని చిన్న గోకుల్ తండా వాసులు ఆరోపిస్తున్నారు. కు ప్రత్యేక పంచాయతీ ఏర్పాటు […]

బ్యాలెట్‌లో అభ్యర్థి గుర్తు గల్లంతు.. పోలింగ్‌ను నిలిపివేసిన అధికారులు..!

నాగర్‌ కర్నూల్‌ జిల్లా వెల్దండలో ఓ వార్డులో ఓటింగ్‌ నిలిచిపోయింది. మండలం కుప్పగండ్ల గ్రామ పంచాయతీలోని పదో వార్డులో అభ్యర్థికి గుర్తు కేటాయించ లేదు. వార్డు సభ్యుడి ఎన్నికకు ముగ్గురు అభ్యర్థులు పోటీ చేశారు. అయితే, ఎన్నికల సంఘం తరఫున వచ్చిన బ్యాలెట్‌ పత్రాలత్లో యాదయ్య అనే అభ్యర్థికి కేటాయించిన గుర్తు కనిపించలేదు. దాంతో ఓటర్లంతా షాక్‌ అయ్యారు. ఒక అభ్యర్థికి గుర్తు కేటాయించపోవడంతో సదరు అభ్యర్థి ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేశారు. దాంతో పోలింగ్‌ను అధికారులు […]

మొదలైన తొలి విడుత పంచాయతీ ఎన్నికలు.. క్యూలైన్లలో బారులు తీరిన ఓటర్లు..

రాష్ట్రంలో తొలి విడుత పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ ప్రారంభమైంది. పెద్ద సంఖ్యలో ఓటర్లు క్యూన్లలో బారులు తీరి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. గురువారం ఉదయం 7 గంటలకు పోలింగ్‌ మొదలు కాగా.. మధ్యాహ్నం ఒంటి గంట వరకు కొనసాగనున్నది.ఆ తర్వాత 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ నిర్వహించి.. ఫలితాలను ప్రకటిస్తారు.

తన మతంలో ఇలా జరిగితే ఊరుకుంటారా?-పరకామణి కేసులో జగన్ పై పవన్ కల్యాణ్ విమర్శలు

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. ఇస్లాం, క్రైస్తవ మతాలకు ఒకలా, హిందూ మతానికి మరోలా నిబంధనలు ఉండకూడదని ఆయన స్పష్టం చేశారు. పరాకామణి కేసు చిన్నదన్న జగన్ వ్యాఖ్యలను, తన మతంలో ఇలా జరిగి ఉంటే ఇలాగే స్పందించేవారా ఇని ప్రశ్నించారు. మెజారిటీ పేరిట హిందువులు వివక్షకు గురవుతున్నారని అన్నారు. హిందువులు మెజారిటీ అనేది ఒక భ్రమ. కులం, మతం, భాష, ప్రాంతాల వారీగా వారు విడిపోయి ఉన్నారు […]

రాహుల్.. లీడర్ ఆప్ పర్యటన్ అంటూ బీజేపీ విమర్శ, ప్రియాంక కౌంటర్

పార్లమెంటు శీతాకాల సమావేశాలు ఓవైపు జరుగుతుండగా కాంగ్రెస్ సీనియర్ నేత, లోక్‌సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ జర్మనీ పర్యటనకు వెళ్తున్నారు. దీనిపై బీజేపీ విమర్శలు గుప్పించింది. ఆయనను ‘లీడర్ ఆఫ్ పర్యటన్’ అంటూ అభివర్ణించింది,రాహుల్ సీరియస్ పొల్టీషియన్ కాదని అన్నారు. కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ వాద్రా తిప్పికొట్టారు. ప్రధానమంత్రి సగం పనిరోజులు విదేశాల్లోనే గడుపుతుంటారని గుర్తుచేశారు.

తొలి దశ పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధం.. ఆ 395 స్థానాల్లో నో పోలింగ్

తెలంగాణలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు రంగం సిద్ధమైంది. తొలి దశ పంచాయతీ ఎన్నికల పోలింగ్ డిసెంబర్ 11, గురువారం నాడు జరగనుంది. దీనికి సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.గురువారం జరగబోయే పోలింగ్ కోసం ఇప్పటికే మండల కేంద్రాలకు బ్యాలెట్ పేపర్లు, బాక్సులు పంపించారు. 5 చోట్ల అసలు నామినేషన్ దాఖలు కాలేదు. మరో 395 స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. ఇవి మినహా మిగిలిన 3,836 సర్పంచ్ స్థానాలకు గురువారం ఎన్నికలు జరగనున్నాయి.

సర్పంచ్ ఎన్నికల ఘర్షణలో BRS నేత హత్య

సూర్యాపేట జిల్లాలో నూతనకల్‌ మండలం లింగంపల్లిలో సర్పంచ్‌ ఎన్నికలు ప్రచార వేళ కాంగ్రెస్‌ మరియు బీఆర్‌ఎస్‌ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగి ఒకరి ప్రాణం కోల్పోయిన ఘటన కలకలం రేపింది. కాంగ్రెస్‌కు చెందిన సుమారు 70 మంది కార్యకర్తలు కర్రలు, రాళ్లతో బీఆర్‌ఎస్ కార్యకర్తలపై దాడి చేసినట్లు తెలుస్తోంది. ఈ దాడిలో బీఆర్‌ఎస్ కార్యకర్త ఉప్పుల మల్లయ్య తీవ్రంగా గాయపడి, హైదరాబాద్‌కు తరలించే సమయంలో మార్గమధ్యంలో మృతి చెందాడు.

కేంద్రానికి మాత్రమే తమిళనాడు, పుదుచ్చేరి వేర్వేరు : టీవీకే చీఫ్‌ విజయ్‌

ేంద్ర ప్రభుత్వానికి మాత్రమే తమిళనాడు , పుదుచ్చేరి వేర్వేరు అని, తాము మాత్రం అందరం కలిసే ఉన్నామని నటుడు, టీవీకే చీఫ్‌ విజయ్‌ అన్నారు. పుదుచ్చేరిలోని ఉప్పాలం లో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో ఆయన ప్రసంగించారు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ రాష్ట్ర పాలనకు సంబంధించిన విషయాలను పుదుచ్చేరి ప్రభుత్వం నుంచి నేర్చుకోవాలని సూచించారు. కానీ ఆయన (స్టాలిన్‌) ఎప్పటికీ నేర్చుకోరని విజయ్‌ వ్యాఖ్యానించారు. వచ్చే ఏడాది జరగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకేకు ప్రజలు తగిన […]

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON