పార్లమెంటు శీతాకాల సమావేశాలు ఓవైపు జరుగుతుండగా కాంగ్రెస్ సీనియర్ నేత, లోక్‌సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ జర్మనీ పర్యటనకు వెళ్తున్నారు. దీనిపై బీజేపీ విమర్శలు గుప్పించింది. ఆయనను ‘లీడర్ ఆఫ్ పర్యటన్’ అంటూ అభివర్ణించింది,రాహుల్ సీరియస్ పొల్టీషియన్ కాదని అన్నారు. కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ వాద్రా తిప్పికొట్టారు. ప్రధానమంత్రి సగం పనిరోజులు విదేశాల్లోనే గడుపుతుంటారని గుర్తుచేశారు.

