loader

రాహుల్ పర్యటనపై బీఆర్ఎస్ విమర్శలు

తెలంగాణలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పర్యటనపై భారత్ రాష్ట్ర సమితి (BRS) తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించింది. కాంగ్రెస్ పాలనలో రైతు ఆత్మహత్యలు మరియు విద్యార్థుల మరణాల వంటి అంశాలను ప్రస్తావిస్తూ, తెలంగాణ “రక్తమోడుతున్నా” (తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నా) ప్రజలను పరామర్శించేందుకు, సమస్యలను తెలుసుకునేందుకు ఆయనకు సమయం దొరకలేదని రాహుల్ గాంధీ పర్యటన కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే తప్ప, ప్రజా సమస్యల పరిష్కారం కోసం కాదని ఆరోపించింది.

ముగిసిన రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్

తెలంగాణలో రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఆదివారం ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ముగిసింది. కొన్ని గ్రామాలలో సమయంలో లైన్‌లో నిలబడిన ఓటర్లకు ఓటు వేయవచ్చును. రెండు గంటల నుంచి ఓట్ల లెక్కింపు ఉంటుంది. తెలంగాణ వ్యాప్తంగా యువత, పెద్దలు, వృద్ధులు ఓటు వేసేందుకు ఉత్సాహం చూపించారు. రెండో విడత పంచాయతీ ఎన్నికలలో భారీగా ఓటింగ్ శాతం నమోదైనట్టు తెలుస్తోంది. అక్కడక్కడ స్వల్ప ఘర్షణలు చోటుచేసుకున్నాయి.

‘పంచాయతీ’ ముగియగానే పరిషత్ ఎన్నికలకు సమాయత్తం

రాష్ట్రంలో జరుగుతున్న పంచాయతీ ఎన్నికలు మూడో విడత ముగియగానే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను నిర్వహించే యోచనలో ప్రభుత్వం ఉంది. మూడో విడత 17న నిర్వహించేందుకు ఏర్పాట్లు జరిగాయి. దీంతో ఈ నెల 20 నాటికి పంచాయతీ ఎన్నికల ప్రక్రియ పూర్తవుతుంది. ఇక జిల్లాల కలెక్టర్లను సమన్వయం చేసుకుంటూ పరిషత్ ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. సర్వం సిద్ధమైతే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నోటిఫికేషన్‌ను ఈ నెల 23, 27 తేదీల్లో విడుదల చేసేలా ఎన్నికల సంఘానికి […]

రామేశ్వరం కేఫ్‌లో అఖిలేశ్‌ యాదవ్‌తో కేటీఆర్‌ భోజనం

హైదరాబాద్‌లోని రామేశ్వరం కేఫ్‌లో సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు, ఎంపీ అఖిలేశ్‌ యాదవ్‌తో కలిసి  బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ భోజనం చేశారు. ఇరువురు నేతలకు కేఫ్‌ యజమాని శరత్‌ ఘనస్వాగతం పలికారు. భోజనం సందర్భంగా కేటీఆర్‌, అఖిలేశ్‌ యాదవ్‌ కేఫ్‌ రుచులను ఆస్వాదిస్తూనే రాజకీయ, సమకాలీన అంశాలపై చర్చించుకున్నారు. అద్భుతమైన రుచులు అంటూ యజమాని శరత్‌ను అఖిలేశ్‌యాదవ్‌ అభినందించారు. భోజనం అనంతరం ఇరువురు నేతలు తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ నివాసానికి వెళ్లారు

తిరువనంతపురం కొర్పొరేషన్‌ బీజేపీ కైవసం

కేరళలోని తిరువనంతపురం మున్సిపల్ కార్పొరేషన్‌‌కు జరిగిన ఎన్నికల్లో అధికార లెఫ్ట్ డెమోక్రటక్ ఫ్రెంట్ (LDF), కాంగ్రెస్ సారథ్యంలోని నేషనల్ డెమోక్రటిక్ ఫ్రంట్ (UDF)కు గట్టి దెబ్బ తగిలింది. భారతీయ జనతా పార్టీ (BJP) సారథ్యంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయెన్స్ (NDA) విజయకేతనం ఎగురవేసింది. 101 వార్డులకు జరిగిన ఎన్నికల్లో 50 వార్డులను బీజేపీ కైవసం చేసుకుంది. ఎల్‌డీఎఫ్ 29 వార్డుల్లో గెలుపు సాధించగా, 19 వార్డులను యూడీఎఫ్ సొంతం చేసుకుంది. రెండు వార్డుల్లో ఇండిపెండెంట్లు గెలిచారు.

కేటీఆర్‌తో సమావేశమైన అఖిలేష్‌ యాదవ్‌..

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావుతో సమాజ్‌ వాదీ పార్టీ జాతీయ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ సమావేశమయ్యారు. కేసీఆర్‌ ఇంటికి వచ్చిన అఖిలేష్‌కు కేటీఆర్‌, హరీశ్‌రావు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఇద్దరు నేతలు పలు అంశాలపై చర్చించారు. అనంతరం కేటీఆర్‌ మాట్లాడుతూ త్వరలోనే అఖిలేష్ యాదవ్ కేసీఆర్‌తో సమావేశం అవుతారన్నారు. అఖిలేష్ పార్టీ స్ఫూర్తితో భారత రాష్ట్ర సమితి కూడా భవిష్యత్తులో ముందుకు సాగుతామన్నారు.

ప్రియాంక కాంగ్రెస్ పగ్గాలు చేపట్టాలి మాజీ ఎమ్మెల్యే డిమాండ్

ఒడిశా మాజీ ఎమ్మెల్యే మహమ్మద్ మోక్విమ్, కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష బాధ్యతలను ప్రియాంక గాంధీ వాద్రాకు అప్పగించాలని కోరుతూ అగ్రనేత సోనియా గాంధీకి ఆరు పేజీల సంచలన లేఖ రాశారు. వయసు పైబడటంతో ప్రస్తుత అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను బాధ్యతల నుంచి తప్పించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. “పార్టీ క్లిష్ట దశలో ఉంది.. కాంగ్రెస్‌కు కొత్త నాయకత్వం అవసరం. గత మూడేళ్లుగా రాహుల్‌ను కలవడానికి తాను చాలా ప్రయత్నించినా, అపాయింట్‌మెంట్ దొరకలేదని లేఖలో పేర్కొన్నారు.

టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి మరో వివాదం.. వరుసగా వాట్సాప్ స్టేటస్‌లు

ఎన్టీఆర్‌ జిల్లా తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు తన వాట్సాప్ స్టేటస్‌లతో సొంత పార్టీ నేతల్ని టార్గెట్ చేశారు. ‘నువ్వు దేనికి అధ్యక్షుడివి ??? పేకాట క్లబ్ కా ???.. పేకాట కోసం ఆఫీస్ పెట్టావంటే..నువ్వు నిజంగా రాయల్.. కొండపర్వ గట్టు దగ్గర డే అండ్ నైట్ మ్యాచ్’ అంటూ వాట్సాప్ స్టేటస్ పెట్టుకున్నారు. తిరువూరు నియోజకవర్గం విస్సన్నపేట మండల టీడీపీ అధ్యక్షుడు రాయల సుబ్బారావు టార్గెట్‌గా ఈ స్టేటస్‌లు పెట్టినట్లు ప్రచారం జరుగుతోంది

సోషల్ మీడియాలో ట్రోలింగ్స్.. హైకోర్టును ఆశ్రయించిన పవన్ కల్యాణ్

జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. సోషల్ మీడియా వేదికగా తన వ్యక్తిత్వ, హక్కులను ఉల్లంఘించేలా వ్యవహరిస్తున్నారని అంటూ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఆ పోస్టుల కారణంగా తన వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం వాటిల్లుతుందని పిటిషన్‌లో పేర్కొన్నారు. వారం రోజుల్లో ఉల్లంఘనకు సంబంధించిన వివరాలను సమర్పించాలని కోర్టు ఆదేశించింది. ఫిర్యాదులపై చర్యలు తీసుకోవాలని మెటా, గూగుల్, ఎక్స్‌కు ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

నిన్న జగన్ సమక్షంలో వైసీపీలో చేరిక.. ఇవాళ టీడీపీలోనే ఉన్నానంటూ వీడియో

నెల్లూరు మేయర్ ఎన్నిక ఈ నెల 18 జరగనుంది. ఈ క్రమంలో పలువురు కార్పొరేటర్లు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమక్షంలో.. ఐదుగురు కార్పొరేటర్లు వైఎస్సార్‌సీపీలో చేరారు. వీరంతా వైఎస్సార్‌సీపీ నుంచి టీడీపీలో చేరినవారు.. పార్టీలో చేరి కొన్ని గంటలు కూడా గడవకముందే ఓబిలి రవిచంద్ర మళ్లీ టీడీపీలో కొనసాగుతామని చెప్పారు. ఈ మేరకు వీడియోను విడుదల చేశారు.. మద్దినేని మస్తానమ్మ, కుమారుడు మద్దినేని శ్రీధర్ టీడీపీలోనే కొనసాగుతామని చెప్పినట్లు తెలుస్తోంది.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON