నెల్లూరు మేయర్ ఎన్నిక ఈ నెల 18 జరగనుంది. ఈ క్రమంలో పలువురు కార్పొరేటర్లు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమక్షంలో.. ఐదుగురు కార్పొరేటర్లు వైఎస్సార్సీపీలో చేరారు. వీరంతా వైఎస్సార్సీపీ నుంచి టీడీపీలో చేరినవారు.. పార్టీలో చేరి కొన్ని గంటలు కూడా గడవకముందే ఓబిలి రవిచంద్ర మళ్లీ టీడీపీలో కొనసాగుతామని చెప్పారు. ఈ మేరకు వీడియోను విడుదల చేశారు.. మద్దినేని మస్తానమ్మ, కుమారుడు మద్దినేని శ్రీధర్ టీడీపీలోనే కొనసాగుతామని చెప్పినట్లు తెలుస్తోంది.

