loader

నెల్లూరు మేయర్ స్రవంతి రాజీనామా ఆమోదం…ఇన్‌చార్జి మేయర్‌గా రూప్‌కుమార్ యాదవ్

నెల్లూరు మున్సిపల్ కార్పొరేషను మేయర్ పొట్లూరి స్రవంతి రాజీనామాను కలక్టర్ హిమాన్షు శుక్లా ఆమోదించారు. ఇకపోతే ఈనెల 18న మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ సాధారణ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో కొత్త మేయర్‌ను ఎన్నుకునే అవకాశం ఉంది.కొత్త మేయర్ ఎంపికయ్యే వరకు ఇన్‌చార్జి మేయర్‌గా డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ కొనసాగనున్నారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

రేవంత్‌తో సోషల్‌ మీడియా ‘ఫుట్‌బాల్‌’.. మెస్సీ టూర్‌లో ప్రవర్తనపై విమర్శలు

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఫుట్‌బాల్‌ సరదాతో ప్రజాధనం వృథా చేసిన తీరు, దిగ్గజ ఆటగాడు లియోనల్‌ మెస్సీ టూర్‌లో రేవంత్‌రెడ్డి ప్రవర్తనపై విమర్శలు వెల్లువెత్తుతున్నా యి. బాడీగార్డ్‌లాగా వ్యవహరించారంటూ సెటైర్లు,సీఎం బంధుమిత్రుల పిల్లలకే ఆడే అవకాశం, కుటుంబ పిక్నిక్‌గా మార్చుకున్నారని ఆగ్రహం దీనికి వంద కోట్ల ఖర్చా అని ధ్వజం, బాల్‌ పాస్‌ చేయడం కూడా రాలేదని ఎద్దేవా,ఆడుకుంటున్న కంటెంట్‌ క్రియేటర్స్‌, బాయ్‌ జెర్సీ నంబర్‌ నైన్‌ అంటూ సంబోధన, గతంలో కేసీఆర్‌ మనుమడిపై రేవంత్‌ విమర్శలు

ఓటు చోరీ బిజెపి డిఎన్‌ఏలోనే ఉంది: రాహుల్ గాంధీ

ఓటు చోరీ అనేది బీజేపీ డిఎన్ ఏలోనే ఉందని , రానున్న ఎన్నికల్లో నరేంద్రమోదీ -ఆర్ ఎస్ ఎస్  ప్రభుత్వాన్ని అధికారం నుంచి తొలగిస్తామని కాంగ్రెస్ ప్రతిజ్ఞ చేసినట్లు వెల్లడించారు. రామ్ లీలా మైదానంలో పార్టీ ఆధ్వర్యంలో జరిగిన ఓట్ చోర్ గద్దీ ఛోడ్  ర్యాలీలో రాహుల్ గాంధీ  ఆరోపించారు. ఎన్నికల కమిషన్ పై తీవ్ర విమర్శలు చేశారు. మోదీ అండ్ కో కు అధికారం ఉందని, అందుకే వారు ఓట్ చోరీలో మునిగి పోయారని ఆయన […]

ఓట్‌ చోరీ, ఎస్‌ఐఆర్‌ ద్వారా అక్రమంగా గెలవాలని బీజేపీ చూస్తోంది : సీఎం రేవంత్ రెడ్డి

రాజ్యాంగాన్ని రద్దు చేయాలని బీజేపీ చూస్తోందని, కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి అన్నారు. ‘ఓట్‌ చోర్‌-గద్దీ ఛోడ్‌’ పేరుతో దిల్లీలోని రామ్‌లీలా మైదానంలో కాంగ్రెస్‌ పార్టీ మహా ధర్నాలో రేవంత్​ రెడ్డి ప్రసంగించారు. ఆర్ఎస్ఎస్, గోల్వాల్కర్ భావజాలంతో ఉన్న నరేంద్ర మోదీ, అమిత్ షా కేంద్రంలో భావజాలాన్ని అమలు చేసేందుకు 400 సీట్లు కావాలని కోరుకున్నారని, బీజేపీకి 400 సీట్లు ఇస్తే రాజ్యాంగాన్ని మారుస్తారని, రిజర్వేషన్లు ఎత్తివేస్తారని ఆ పార్టీని 240 […]

పులివెందులలో బీటెక్ రవికి షాక్.. ఇళ్లకు తాళాలు వేసిన గ్రామస్థులు

పులివెందుల నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జి బీటెక్ రవికి చేదు అనుభవం ఎదురైంది. వేంపల్లి మండలంలో బీటెక్ రవికి నిరసన సెగ తగిలింది. మండలంలోని అమ్మగారిపల్లి గ్రామంలో కొన్ని కుటుంబాలు వైసీపీని వీడి టీడీపీలో చేరేందుకు సిద్ధమయ్యాయి. దీంతో వారికి టీడీపీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించేందుకు బీటెక్ రవి అక్కడకు వెళ్లారు. అయితే బీటెక్ రవి రాకతో అమ్మగారిపల్లి గ్రామస్తులు.. ఇళ్లకు తాళాలు వేసి బయటకు వెళ్లిపోయారు. దీంతో ఈ విషయం ప్రాధాన్యం సంతరించుకుంది.

రెండో విడతలోనూ కాంగ్రెస్​ మద్దతుదారుల హవా – వెయ్యికి పైగా స్థానాల్లో పాగా

తెలంగాణలో గ్రామపంచాయతీ ఎన్నికల రెండో విడత ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది. ఇప్పటివరకు ప్రకటించిన ఫలితాల్లో కాంగ్రెస్‌ పార్టీ మద్దతుదారులు 1928కు పైగా సర్పంచి స్థానాల్లో విజయాలను తమ ఖాతాలో వేసుకున్నారు. భారత రాష్ట్ర సమితి మద్దతుదారులు 1027, బీజేపీ మద్దతుదారులు 219 స్థానాల్లో గెలుపొందారు. 552 స్థానాల్లో ఇతరులు విజయం సాధించారు. రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో మొత్తం 85.86 శాతం పోలింగ్ నమోదైంది

లక్కీ డ్రాలో వరించిన సర్పంచ్ పదవి

మెదక్ జిల్లా , మండలంలోని  చీపురుదుబ్బ తండా గ్రామపంచాయతీలో మొత్తం 377 ఓట్లు ఉండగా 367 ఓట్లు పోలయ్యాయి. కాంగ్రెస్ అభ్యర్థి సునీతకు 182 ఓట్లు రాగా బిఆర్ఎస్ అభ్యర్థి బిమిలికి కూడా 182 ఓట్లు వచ్చాయి. మరో రెండు ఓట్లు చెల్లకుండా పోయాయి. ఒక ఓటు నోటా కి పడింది. దీంతో ఇద్దరికి సమానంగా ఓట్లు రావడంతో ఎన్నికల అధికారులు డ్రా తీయగా కాంగ్రెస్ అభ్యర్థి కెతావత్ సునిత విజయం సాధించింది.

బీజేపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా.. బీహార్ మంత్రి నితిన్ నబిన్

భారతీయ జనతా పార్టీ (బీజేపీ) జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బీహార్‌ మంత్రి నితిన్ నబిన్‌ను ఆ పార్టీ నియమించింది. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ ఆదివారం జారీ చేసిన అధికారిక ఉత్తర్వులో ఈ విషయాన్ని వెల్లడించారు నితిన్‌ నబిన్ ప్రస్తుతం సీఎం నితీశ్‌ కుమార్ నేతృత్వంలోని బీహార్ ప్రభుత్వంలో రోడ్డు నిర్మాణ మంత్రిత్వ శాఖ నిర్వహిస్తున్నారు. ఐదుసార్లు బీహార్ ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆయన కాయస్థ వర్గానికి చెందినవారు.

రెండో విడత ఎన్నికల్లో కాంగ్రెస్‌దే హవా

తెలంగాణలో రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్‌లో ఫలితాల్లో అధికార కాంగ్రెస్‌ పార్టీనే ఆధిక్యంలో ఉంది. ఆదివారం జరిగిన పోలింగ్‌ అనంతరం ఓట్ల లెక్కింపు జరుగుతోంది. లెక్కింపులో కాంగ్రెస్ 305 స్థానాల్లో గెలుపొందింది. ఆ తర్వాత ప్రతిపక్ష బిఆర్ఎస్‌కు 36, బిజెపికి 9, ఇతరులకు 65 స్థానాలు దక్కాయి. ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఈ విడతలో 4,333 సర్పంచి స్థానాలకు, 38,350 వార్డు స్థానాలకు ఎన్నికలు జరిగాయి

సైనికుడికే దక్కని ఓటు హక్కు!.. ఇదేనా మన ఎన్నికల వ్యవస్థ?

నిజామాబాద్ జిల్లాలో రెండో విడత ఎన్నికల పోలింగ్ సందర్భంగా మంచిప్ప గ్రామానికి చెందిన జవాన్ ప్రవీణ్ తన ఓటు హక్కు వినియోగించుకోవడానికి ప్రత్యేకంగా వచ్చారు. తీరా పోలింగ్ కేంద్రానికి వెళ్లగా “మీ ఓటు పోస్టల్  బ్యాలెట్ ద్వారా ఇప్పటికే రాజమండ్రికి పంపబడింది” అని అధికారులు  చెప్పారు. దేశ సేవలో ఉన్న తన ఓటును, తన అనుమతి లేకుండా మరొక ప్రాంతానికి ఎలా కేటాయిస్తారంటూ అధికారులను నిలదీశారు. తన ఓటు హక్కు వినియోగించుకునేందుకు వెంటనే అనుమతి ఇవ్వాలని ఆయన […]

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON