నిజామాబాద్ జిల్లాలో రెండో విడత ఎన్నికల పోలింగ్ సందర్భంగా మంచిప్ప గ్రామానికి చెందిన జవాన్ ప్రవీణ్ తన ఓటు హక్కు వినియోగించుకోవడానికి ప్రత్యేకంగా వచ్చారు. తీరా పోలింగ్ కేంద్రానికి వెళ్లగా “మీ ఓటు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఇప్పటికే రాజమండ్రికి పంపబడింది” అని అధికారులు చెప్పారు. దేశ సేవలో ఉన్న తన ఓటును, తన అనుమతి లేకుండా మరొక ప్రాంతానికి ఎలా కేటాయిస్తారంటూ అధికారులను నిలదీశారు. తన ఓటు హక్కు వినియోగించుకునేందుకు వెంటనే అనుమతి ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.

