loader

టికెట్ల రేట్ల పెంపు ఉండదన్నారు కదా.. రాత్రికి రాత్రి జీవోలు ఎలా వస్తున్నాయి: హరీశ్‌రావు

తెలంగాణలో ఇప్పుడు థియేటర్ల కంటే.. సచివాలయంలోనే ఒక పెద్ద సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా నడుస్తోందని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ నాయకులు హరీశ్‌రావు తెలిపారు. రాష్ట్రంలో అసలు ప్రభుత్వం ఉందా.. ఉంటే ఎవరి కంట్రోల్‌లో ఉంది అనే అనుమానం ప్రతి ఒక్కరికీ కలుగుతోందని అన్నారు. ఒకవైపు టికెట్ ధరలు పెంచుతూ జీవో బయటికి వస్తుందని.. మరోవైపు.. ఆ శాఖకు బాధ్యత వహించాల్సిన సినిమాటోగ్రఫీ మంత్రి గారేమో.. నాకు తెలియదు.. నా ప్రమేయం లేదు.. నా దగ్గరికి ఫైల్ రాలేదు […]

సికింద్రాబాద్‌ కోసం అవసరమైతే ఆమరణ దీక్ష చేస్తాం.. రేవంత్‌ సర్కార్‌పై తలసాని ధ్వజం

సికింద్రాబాద్‌లో లష్కర్‌ జిల్లా సాధన సమితి సమావేశంలో తలసాని మాట్లాడుతూ. పేర్లు మారుస్తానని రేవంత్ రెడ్డి కంకణం కట్టుకున్నారని సికింద్రాబాద్‌ను జిల్లా చేయాలని గ్రేటర్‌ సికింద్రాబాద్‌ మున్సిపల్ కార్పొరేషన్‌ ఏర్పాటు చేయాలన్నారు. రాజకీయాలకు అతీతంగా ఎవరైనా నిరసన కార్యక్రమాల్లో పాల్గొనవచ్చని తెలిపారు. మన తండ్రి, తల్లి పేరు మారిస్తే ఊరుకుంటామా అని మండిపడ్డారు. మన ప్రాంతం పేరు మార్చడానికి వీళ్లేవరని ఆగ్రహం వ్యక్తం  చేశారు. నీ ఇష్టానుసారం చేస్తానంటే నడవదని రేవంత్‌ రెడ్డిని హెచ్చరించారు.

మొరిగే కుక్కలు కరవవు- ముందు మీ పార్టీ పగ్గాలు ఇచ్చి మాట్లాడండి- ఒవైసీపై బీజేపీ ఫైర్

మొరిగే కుక్కలు ఎప్పుడూ కరవవు, బురఖా వేసుకున్న మహిళ ఈ దేశానికి ప్రధాని అయితే, భారత్ ఒక ‘ఇస్లామిక్ స్టేట్’గా మారిపోతుంది” అంటూ బీజేపీ సీనియర్ నేత నితేశ్ రాణే ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీపై నిప్పులు చెరిగారు. మీ పార్టీ జాతీయ అధ్యక్షురాలిగా ఒక హిజాబ్ లేదా బురఖా ధరించిన మహిళను నియమించండి. పోనీ ఒక ‘పస్మాండా’ ముస్లింనైనా ఆ పదవిలో కూర్చోబెట్టండి. మీరేమో మహిళలను అధ్యక్షురాలిని చేయరు, కానీ దేశానికి మాత్రం మహిళా ప్రధాని […]

పల్నాడులో వైసిపి కార్యకర్తపై దాడి

పల్నాడు జిల్లా పిన్నెల్లి గ్రామంలో వైసిపి కార్య‌క‌ర్త‌పై దాడి జరిగింది. వైసిపి కార్యకర్త మంద సల్మాన్ పై టిడిపి నాయకుడు మోటమర్రి పేతురు కర్రలతో దాడి చేశారని బాధితుడు కుటుంబ సభ్యుల ఆరోపణలు చేశారు. వెంటనే మంద సల్మాన్ స్థానిక ఆస్పత్రికి తరలించారు. మంద సాల్మన్ తలకు తీవ్ర గాయాల అయ్యాయని వైద్యులు వెల్లడించారు. గ్రామాలలో టిడిపి కార్యకర్తలు రెచ్చిపోతున్నారని మంద సల్మాన్ కుటుంబ సభ్యులు ఆరోపణలు చేశారు. టిడిపి కార్యకర్తలు అరాచకాలకు అడ్డుఅదుపులేకుండాపోయిందని వాపోతున్నారు.

తెలంగాణపై పవన్ కల్యాణ్ ఫోకస్: మున్సిపల్ ఎన్నికల్లో పోటీకి జనసేన సై

తెలంగాణలో జనసేన పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసే దిశగా, మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయాలని జనసేన పార్టీ నిర్ణయించింది. ఈ మేరకుజనసేన పార్టీ ఒక ప్రకటనవిడుదల చేసింది. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయాలనే లక్ష్యంతో ఇప్పటికే పార్టీ కార్యచరణ ప్రారంభించింది అని ప్రకటనలో పేర్కొన్నారు. ఎన్నికలకు నెలరోజుల కంటే తక్కువ సమయం ఉన్నప్పటికీ…సాధ్యమైనన్ని స్థానాల్లో జనసేన పార్టీ అభ్యర్థులు బరిలోకి దిగనున్నారు అని జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి తాళ్లూరి రామ్ తెలిపారు.

అమరావతిని వ్యతిరేకించలేదు – జగన్ ఎప్పుడూ రాష్ట్రానికి ద్రోహం చేయలేదు – సజ్జల వివరణ

అమరావతిని జగన్ వ్యతిరేకించలేదని వైసీపీ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. జగన్ ఇల్లు అమరావతిలోనే ఉందన్నారు. పెద్దపెద్ద భవనాలను కడుతూ ప్రజాధనం వృధా చేస్తున్నారనే జగన్ ప్రశ్నించారన్నారు. అమరావతి అనేది కేవలం ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారంగా మారిందని, అక్కడ చంద్రబాబు నాయుడు తన అనుకూల వర్గాలకు లబ్ధి చేకూర్చేలా వ్యవహరిస్తున్నారని అన్నారు. జగన్ లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానం చెప్పడం లేదన్నారు. జగన్ ఎప్పుడూ రాష్ట్రానికి ద్రోహం చేయలేదని స్పష్టం చేశారు.

ఏపీలో అశాంతి కోసం బెంగళూరు కేంద్రంగా కుట్రలు- యనమల

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి బెంగళూరు ప్యాలెస్‌లో మకాం వేయడంపై తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఏపీలో అశాంతి సృష్టించేందుకు, కుట్రలు పన్నేందుకే జగన్ బెంగళూరును వేదికగా చేసుకున్నారని యనమల స్పష్టం చేశారు. ఐదేళ్ల కాలంలో పోగేసిన అవినీతి సంపదను రక్షించుకోవడానికి, రాజకీయంగా లబ్ధి పొందడానికి ఆయన పన్నాగం పన్నుతున్నారని ఆరోపించారు.

నిజామాబాద్‌ పేరు మార్పుపై పొలిటికల్ వార్: ఇందూరుగా మార్చాలని బీజేపీ

నిజామాబాద్ జిల్లా పేరును ఇందూరుగా మార్చాలని జిల్లాలో డిమాండ్ మెుదలైంది. ఒకప్పుడు ఇందూర్‌గా ఉండే పేరును నిజాం అనే వ్యక్తి జోక్యంతో నిజామాబాద్ పేరుగా మార్చాడు అని అంటున్నారు. ఈ క్రమంలో ప్రజల ఉద్యమానికి ఎంపీ ధర్మపురి అరవింద్ తన సంఘీభావం వ్యక్తం చేశారు. జిల్లాకు నిజామాబాద్ అనే పేరు అపశకునం లాగా మారింది అని ధ్వజమెత్తారు. బీజేపీ వ్యక్తి మేయర్ అయిన వెంటనే నిజామాబాద్ పేరును ఇందూరుగా మారుస్తామని కీలక ప్రకటన చేశారు అని ధ్వజమెత్తారు.

ప్రపంచస్థాయి దేశాలతో తెలంగాణ పోటీపడేందుకు ప్రభుత్వం కృషి : రేవంత్

ప్రపంచ నగరాలతో హైదరాబాద్ పోటీపడుతోందని సిఎం రేవంత్ రెడ్డి తెలిపారు. పెట్టుబడులకు లాభం వచ్చేలా ప్రభుత్వ ప్రణాళికలు ఉన్నాయని అన్నారు. రంగారెడ్డి జిల్లా రావిర్యాలలో సుజెన్ మెడికేర్ ప్రారంభోత్సవం నిర్వహించారు. పెట్టుబడిదారులకు విశ్వాసం కల్పించేలా ప్రభుత్వం పాలసీ రూపొందించిందని, పెద్ద కంపెనీలకు సిఇవోలుగా ఉన్నది.. మన దేశంవాళ్లేనని రేవంత్ పేర్కొన్నారు. పంచాయతీ కావాలా.. నీళ్లు కావాలా.. అని తనని అడిగే.. తెలంగాణకు నీళ్లే కావాలని చెబుతానని, వివాదాలు కావాలా.. పరిష్కారం కావాలా.. అని అడిగితే పరిష్కారం కావాలని […]

టీటీడీ సభ్యత్వానికి జంగా రాజీనామా.. ఆమోదించాలంటూ సీఎంకు లేఖ

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలకమండలి సభ్యత్వానికి జంగా కృష్ణమూర్తి రాజీనామా చేశారు. ఈ మేరకు శుక్రవారం తన రాజీనామా లేఖను సీఎం చంద్రబాబు నాయుడుకి పంపారు. గతంలో తనకు కేటాయించిన బాలాజీనగర్‌‌లో ప్లాట్ నెంబర్ 2 నేటికీ ఖాళీగానే ఉందని.. దీనిని తనకు కేటాయించాలంటూ ప్రభుత్వాన్ని కోరారని సమాచారం. అయితే గురువారం జరిగిన కేబినెట్ భేటీలో ఈ భూ కేటాయింపును రద్దు చేసినట్లు సమాచారం. దాంతో ఆయన టీటీడీ సభ్యత్వ పదవికి రాజీనామా చేశారనే ప్రచారం […]

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON