తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలకమండలి సభ్యత్వానికి జంగా కృష్ణమూర్తి రాజీనామా చేశారు. ఈ మేరకు శుక్రవారం తన రాజీనామా లేఖను సీఎం చంద్రబాబు నాయుడుకి పంపారు. గతంలో తనకు కేటాయించిన బాలాజీనగర్లో ప్లాట్ నెంబర్ 2 నేటికీ ఖాళీగానే ఉందని.. దీనిని తనకు కేటాయించాలంటూ ప్రభుత్వాన్ని కోరారని సమాచారం. అయితే గురువారం జరిగిన కేబినెట్ భేటీలో ఈ భూ కేటాయింపును రద్దు చేసినట్లు సమాచారం. దాంతో ఆయన టీటీడీ సభ్యత్వ పదవికి రాజీనామా చేశారనే ప్రచారం సాగుతోంది.

