వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి బెంగళూరు ప్యాలెస్‌లో మకాం వేయడంపై తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఏపీలో అశాంతి సృష్టించేందుకు, కుట్రలు పన్నేందుకే జగన్ బెంగళూరును వేదికగా చేసుకున్నారని యనమల స్పష్టం చేశారు. ఐదేళ్ల కాలంలో పోగేసిన అవినీతి సంపదను రక్షించుకోవడానికి, రాజకీయంగా లబ్ధి పొందడానికి ఆయన పన్నాగం పన్నుతున్నారని ఆరోపించారు.

