నిజామాబాద్ జిల్లా పేరును ఇందూరుగా మార్చాలని జిల్లాలో డిమాండ్ మెుదలైంది. ఒకప్పుడు ఇందూర్గా ఉండే పేరును నిజాం అనే వ్యక్తి జోక్యంతో నిజామాబాద్ పేరుగా మార్చాడు అని అంటున్నారు. ఈ క్రమంలో ప్రజల ఉద్యమానికి ఎంపీ ధర్మపురి అరవింద్ తన సంఘీభావం వ్యక్తం చేశారు. జిల్లాకు నిజామాబాద్ అనే పేరు అపశకునం లాగా మారింది అని ధ్వజమెత్తారు. బీజేపీ వ్యక్తి మేయర్ అయిన వెంటనే నిజామాబాద్ పేరును ఇందూరుగా మారుస్తామని కీలక ప్రకటన చేశారు అని ధ్వజమెత్తారు.

