loader

పవన్ కళ్యాణ్ పిఠాపురానికి కేంద్రం గుడ్ న్యూస్..!

పిఠాపురం రైల్వే స్టేషన్ ను అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ కింద అభివృద్ధి చేయాలని పవన్ కళ్యాణ్ చేసిన ప్రతిపాదనలకు రైల్వే శాఖ ఆమోదం తెలిపింది. రూ.37.25 కోట్లతో స్టేషన్ లో మౌలిక వసతులు అభివృద్ధి చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో స్టేషన్ భవనం, ముఖద్వారంతోపాటు దివ్యాంగుల కోసం ప్రత్యేక సౌకర్యాలతో కూడిన విశ్రాంతిగది నిర్మాణం,అత్యాధునిక టాయిలెట్లు, డ్రైనేజీ వ్యవస్థ, కేబులింగ్, ప్లాట్ ఫారం అభివృద్ధి, షెల్టర్ల నిర్మాణం తదితర అభివృద్ధి పనులు చేపట్టనున్నారు.

జనసేన ఎమ్మెల్యేకు ఈసీ షాక్.. బయటపడ్డ ‘మిరాకిల్’ అక్రమాలు!

నెల్లిమర్ల జనసేన ఎమ్మెల్యే లోకం మాధవి లోకం మాధవికి చెందిన ‘మిరాకిల్ సాఫ్ట్‌వేర్’ సంస్థ ద్వారా ఉద్యోగులకు ఇచ్చే రెగ్యులర్ జీతంతో సంబంధం లేకుండా, ఒక్కో ఉద్యోగి ఖాతాలో అదనంగా రూ. 1 లక్ష నుంచి రూ. 2 లక్షల వరకు జమ చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నిధులను ఎన్నికల ఖర్చు కోసం లేదా ఓటర్లను ప్రలోభపెట్టడానికి మళ్లించారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై సమగ్ర విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిని […]

డీలిమిటేషన్ పై ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు

ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రధాని మోదీ డీలిమిటేషన్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. నియోజకవర్గాల పునర్విభజనపై విపక్షాలు చేస్తున్న విమర్శలకు కౌంటర్ ఇచ్చారు. జనాభా నియంత్రణ వల్ల దక్షిణాది రాష్ట్రాలు లోక్ సభ సీట్లను కోల్పోతాయని వస్తోన్న వాదనలు అవాస్తవమని వెల్లడించారు. జనాభా సంఖ్య తగ్గితే ఎంపీ సీట్లు కోల్పోతారని తప్పుడు ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు. పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజన వల్ల కేరళ, కర్నాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాలకు ఎలాంటి ఇబ్బందులు రావని స్పష్టం చేశారు.

వైసీపీపై ఎమ్మెల్సీ నాగబాబు ఘాటు వ్యాఖ్యలు..

రాజకీయాల్లో మరోసారి మాటల యుద్ధం తారా స్థాయికి చేరింది. సినీ నటుడు, జనసేన ఎమ్మెల్సీ నాగబాబు  వైసీపీపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. తన సోషల్ మీడియా ఖాతాలో  పోస్ట్ విడుదల చేశారు. ఒక నాయకుడు తన వివేకం కోల్పోతే తర్వాతి స్థాయి నాయకత్వం సాధారణంగా పరిస్థితిని సరి చేసుకుంటుంది. కానీ వైసీపీ నేతల పరిస్థితి మాత్రం భిన్నంగా ఉంది. పార్టీ లీడర్ మాత్రమే కాక, మొత్తం క్యాడర్, తదుపరి స్థాయి నాయకత్వం కూడా వివేకం కోల్పోయినట్లు వ్యవహరిస్తోందని […]

మ్యాచ్‌లు పోతున్నా… విజయ్‌కి మాత్రం కలిసి వస్తుంది! స్టేడియం అంతా విజిల్ సౌండ్సే!

చెన్నై సూపర్ కింగ్స్ ఆడే మ్యాచ్ లు మాత్రం దళపతి విజయ్‌కి మాత్రం బాగా కలిసి వస్తున్నాయి. ఆయన పార్టీకి ఖర్చు లేని పబ్లిసిటీ ఈ మ్యాచ్‌ల ద్వారా లభిస్తోంది. ఆదే “విజిల్ మోత “..! పొలిటికల్ పార్టీ “తమిళ్ వెట్రి కళగం “(TVK)కు ఎన్నికల గుర్తుగా విజిల్ (ఈల)ను కేటాయించింది ఎలక్షన్ కమిషన్. దానితో ఆయన అభిమానులు కార్యకర్తలు ఎక్కడికి వెళ్లినా విజిల్ సౌండ్ చేస్తూ హంగామా చేస్తున్నారు. దానికి తోడు ఐపీఎల్ రావడంతో చెన్నై […]

ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డికి ఎదురుదెబ్బ.. ఇబ్రహీంపట్నం బీఆర్ఎస్..

కాంగ్రెస్ ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డికి ఎదురుదెబ్బ తగిలింది. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీని బీఆర్ఎస్ (BRS) కైవసం చేసుకుంది. భారీ బందోబస్తు, ఆందోళనల మధ్య జరిగిన ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక ప్రక్రియ ముగిసింది.ఇబ్రహీంపట్నం చెర్మన్ గా బీఆర్ఎస్ అభ్యర్థి సుదర్శన్ రెడ్డి ఎన్నికయ్యారు. వైఎస్ చైర్పర్సన్ బీజేపీ కౌన్సిలర్ శ్యామలను ఎన్నుకున్నారు. అయితే మంత్రి పదవి కోసం మల్ రెడ్డి ప్రయత్నాలు ఈ మున్సిపాలిటీని చేజార్చుకోవడంతో ఆయన ఆశలు గల్లంతనట్లేనని […]

క్యాతనపల్లి మున్సిపల్ పీఠం బిఆర్ఎస్ దే

క్యాతనపల్లి మున్సిపల్ పీఠం బిఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంది. చైర్మన్ గా బిఆర్ఎస్ అభ్యర్థి గొడిసల సంధ్యారాణిని, వైస్ చైర్మన్ గా సిపిఐ పార్టీకి చెందిన అభ్యర్థి మిట్టపల్లి సరితను బిఆర్ఎస్, సిపిఐ సభ్యులు ఎన్నుకున్నారు. మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి మున్సిపాలిటీలో మొత్తం 22 వార్డులు ఉన్నాయి. 10 వార్డుల్లో బిఆర్‌ఎస్‌, ఏడు వార్డుల్లో కాంగ్రెస్, 4 వార్డుల్లో సిపిఐ అభ్యర్థులు గెలిచారు. బిఆర్‌ఎస్‌-సీపీఐ కూటమికి స్పష్టమైన బలం ఉండడంతో క్యాతనపల్లి మున్సిపాలిటీ పీఠంను కైవసం చేసుకుంది.

అప్పుడు నాలుగు పెళ్లిళ్లు చేసుకోలేరు.. అస్సాం ప్రచారంలో అమిత్‌షా

చొరబాటుదారులు నాలుగు పెళ్లిళ్లు చేసుకోకుండా ఉమ్మడి పౌరస్మృతి (UCC)తో అడ్డుకునే వీలుంటుందని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా అన్నారు. గిరిజనాభివృద్ధికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ సమగ్ర మ్యాప్ సిద్ధం చేశారని అమిత్‌షా తెలిపారు. దీనిని ముందుకు తీసుకువెళ్లి, సమర్ధవంతంగా అమలు చేయాలంటే బీజేపీకే ప్రజలు ఓటు వేయాలని కోరారు. మోదీ నాయకత్వంలో తొలిసారి గిరిజన మహిళ దేశ అధ్యక్షురాలు అయిన విషయాన్ని గుర్తు చేశారు.

TRS-ఇప్పుడు ఎవరైనా వాడుకోవచ్చు: కవిత

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పాత పేరు.. కొత్త అజెండాతో ప్రజల ముందుకు వస్తానని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సమితి పేరు ఫ్రీ అయిందని, ఇప్పుడు ఎవరైనా ఆ పేరును వాడుకోవచ్చని అన్నారు. తమ పార్టీ ఆచార్య జయశంకర్‌ సిద్ధాంతాల ప్రకారమే నడుస్తుందన్నారు. తమ పార్టీకి బిహార్‌ సిద్ధాంతకర్త ఎవరూ లేరన్నారు. బీఆర్‌ఎస్‌ ప్రస్తుతం నిద్రావస్థలో ఉందని విమర్శించారు.

ప్రధాని మోదీతో బండి సంజయ్ భేటీ.. కరీంనగర్ మున్సిపల్ విజయంపై ప్రశంసలు!

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ గురువారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిశారు. ఈ సందర్భంగా తెలంగాణ రాజకీయ పరిణామాలు, కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధిపై చర్చించారు. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్‌ను బీజేపీ కైవసం చేసుకోవడంపై ప్రధాని మోదీ ప్రత్యేకంగా సంతోషం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న నిధులు, అభివృద్ధి నినాదంతోనే తాము ప్రజల్లోకి వెళ్లామని, ప్రజలు బీజేపీ నాయకత్వంపై నమ్మకం ఉంచారని బండి సంజయ్ ప్రధానికి […]

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON