loader

నందినగర్‌ నివాసానికి చేరుకున్న కేసీఆర్‌.. కాసేపట్లో సిట్‌ విచారణకు!

బీఆర్‌ఎస్‌ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌ హైదరాబాద్‌లోని నందినగర్‌ నివాసానికి చేరుకున్నారు. ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో సాక్షిగా విచారణకు హాజరయ్యేందుకు ఎర్రవెల్లిలోని ఆయన నివాసం నుంచి బయల్దేరి, బంజారాహిల్స్‌ నందినగర్‌లోని నివాసానికి వచ్చారు. కాసేపట్లో ఆయన సిట్‌ విచారణకు హాజరు కానున్నారు. ఇప్పటికే సిట్‌ అధికారులు కేసీఆర్‌ నివాసానికి వచ్చారు. కాగా కేసీఆర్‌ విచారణ నేపథ్యంలో నందినగర్‌లోని నివాసం వద్ద భారీగా పోలీసులు మోహరించారు. నాలుగంచెల భద్రతను అమలు చేస్తున్నారు.

అంబటి రాంబాబు అరెస్ట్.. నల్లపాడు పోలీస్ స్టేషన్‌కు తరలింపు..

ముఖ్యమంత్రి చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఫిర్యాదుతో గుంటూరు పోలీసులు ఆయనను శనివారం రాత్రి అరెస్ట్ చేసి నల్లపాడు స్టేషన్‌కు తరలించారు. తనపై దాడులు జరగడం వల్లే ఆవేశంలో మాటలు దొర్లాయని ఆయన వివరణ ఇచ్చినప్పటికీ.. పోలీసులు కేసు నమోదు చేసి భారీ బందోబస్తు మధ్య అదుపులోకి తీసుకున్నారు. అంబటి అరెస్టును జగన్ తీవ్రంగా ఖండించారు. ప్రస్తుతం అంబటి నివాసం వద్ద ఉద్రిక్తత కొనసాగుతుండటంతో పోలీసులు అప్రమత్తమయ్యారు.

ఏపీ హైకోర్టులో అంబటి రాంబాబు భార్య హౌస్‌ మోషన్‌ పిటిషన్‌.. పోలీసులపై ఫిర్యాదు

ఏపీ మాజీ మంత్రి అంబటి రాంబాబును అరెస్ట్ చేస్తారన్న క్రమంలో ఆయన భార్య విజయలక్ష్మి ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించారు. తన భర్తతో పాటు మరో 60 మందిని పోలీసులు అక్రమంగా నిర్బంధించారంటూ ఆమె హౌస్ మోషన్ పిటిషన్‌ను దాఖలు చేశారు. తమకు రక్షణ కల్పించడంలో పోలీసులు పూర్తిగా విఫలమయ్యారని ఆమె తన పిటిషన్‌లో పేర్కొన్నారు. ప్రస్తుతం అక్కడ శాంతిభద్రతల సమస్య నెలకొందని,  విజయలక్ష్మి ఆందోళన వ్యక్తం చేశారు. తమకు 24 గంటల పాటు నిరంతర భద్రత కల్పించాలని […]

బీఆర్‌ఎస్‌ శాంతియుత ఆందోళనలను విజయవంతం చేయాలి : మాజీ మంత్రి తలసాని

కాంగ్రెస్ వేధింపు రాజకీయాలకు నిరసనగా ఆదివారం బీఆర్ఎస్ రాష్ట్ర వ్యాప్త శాంతియుత ఆందోళనలను విజయవంతం చేయాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ పిలుపునిచ్చారు. సిట్‌( SIT ) విచారణకు హాజరవుతానని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్పష్టంగా చెప్పినా కూడా సిట్‌ అధికారులు నందినగర్‌లో గోడకు నోటిసులు అంటించడం దారుణమని అన్నారు. ఇది కాంగ్రెస్‌ కక్ష రాజకీయాలకు నిదర్శనమని ఆరోపించారు.

నా గౌరవానికి భంగం కలిగించారు: గోడలకు నోటీసులపై ఏసీపీకి కేసీఆర్ లేఖ

సిట్‌ అధికారులు నందినగర్‌లోని తన ఇంటి గోడలకు నోటీసులు అంటించడంపై కేసీఆర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. జూబ్లీహిల్స్‌ ఏసీపీ వెంకటగిరికి ఆయన లేఖ రాశారు. సిట్ నోటీసులు ఇవ్వడంలో కనీస నిబంధనలను పాటించలేదుఅని చెప్పుకొచ్చారు. చట్టపరమైన అభ్యంతరాలున్నా తాను విచారణలో సిట్‌కు సహకరిస్తానని …  అయితే గోడలకు నోటీసులు అంటించడం సరైన పద్ధతి కాదు అని లేఖలో అభిప్రాయపడ్డారు. సిట్‌ పోలీసుల వైఖరి కోర్టు ధిక్కారం కిందకే వస్తుందని… అంతేకాదు పోలీసుల తీరు తన వ్యక్తిగత గౌరవానికి […]

ఆవేశంలో నోరు జారాను.. వారిని ఉద్దేశించి.. అలా మాట్లాడి ఉండాల్సింది కాదు: అంబటి

అంబటి రాంబాబు దీనిపై స్పందించారు. చట్టవ్యతిరేకంగా మాజీ సీఎం ఫ్లెక్సీని ఏర్పాటు చేశారని, ఆ ఫ్లెక్సీని చించడానికి తాను వెళ్లలేదని తెలిపారు. తాను చంద్రబాబును తిట్టినట్టు జరుగుతున్న  ప్రచారంలో నిజం లేదని అంబటి రాంబాబు పేర్కొన్నారు. తనపై కొందరు దాడి చేసేందుకు  ప్రయత్నించడంతో ఆవేశంలో కొందరిపై నోరు జారానని వివరించారు.  అయితే వారిని ఉద్దేశించి కూడా అలా మాట్లాడి ఉండాల్సింది కాదన్నారు. చంద్రబాబును తిట్టాననే  ఆరోపణలతో తనను అరెస్ట్ చేయాలని ప్రభుత్వం భావిస్తోందని అంబటి రాంబాబు ఆరోపించారు. అరెస్ట్‌లకు భయపడేది లేదన్నారు.

అంబటి రాంబాబుకు టీడీపీ అల్టిమేటం!- గుంటూరులో తిరగలేరని వార్నింగ్!

సీఎం చంద్రబాబును బూతులు తిట్టిన వైసీపీ లీడర్‌ అంబటి రాంబాబుపై చర్యలు తీసుకోవాలని టీడీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. తమ నేతను బూతులు తిట్టిన అంబటి వెంటనే క్షమాపణ చెప్పాలని అన్నారు. తాము తలచుకుంటే వైసీపీ నేతలు గుంటూరులో తిరగలేరని వార్నింగ్ ఇచ్చారు. అసలు గుంటూరులో వైసీపీ ఆఫీసే లేకుండా చేస్తామని అన్నారు. చంద్రబాబు చేసిన కామెంట్స్‌కు 24 గంటల్లో అంబటి క్షమాపణలు చెప్పకపోతే ఆయన్ని గుంటూరులో తిరగకుండా చేస్తామని చెప్పారు.

ఏపీ అంతటా వైసీపీ ఆధ్వర్యంలో పాప ప్రక్షాళన పూజలు

తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందంటూ చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ చేసిన తప్పుడు ఆరోపణలపై వైసీపీ శనివారం పాప ప్రక్షాళన పూజలు నిర్వహించింది. రాష్ట్రవ్యాప్తంగా వేంకటేశ్వరస్వామి ఆలయాల్లోఈ కార్యక్రమాలను నిర్వహించింది . ఎన్టీఆర్‌ జిల్లాలో వైసీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్‌ ఆధ్వర్యంలో విశాఖపట్నం సీతమ్మధార వేంకటేశ్వరస్వామి ఆలయంలో ఎమ్మెల్సీ వరుదు కల్యాణి, మాజీ మేయర్‌ హరి వెంకట కుమారి ఆధ్వర్యంలో పూజలు నిర్వహించారు.

వైసీపీ నేత- కారులో మహిళతో ఉండగా చుట్టుముట్టిన భర్త.. నడిరోడ్డుపై దేహశుద్ధి!

పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అత్యంత సన్నిహితుడు, వైసీపీ పబ్లిసిటీ వింగ్ వర్కింగ్ ప్రెసిడెంట్ హరిప్రసాద్ రెడ్డి ఒక మహిళతో కలిసి కారులో వెళ్తుండగా, తిరుపతి జిల్లాలోని ఒక గ్రామ వైసీపీ సర్పంచ్ అయినా ఆమె భర్త వారిని వెంబడించారు. ఉప్పరపల్లి వద్ద కారును అడ్డగించి, లోపల ఉన్న హరిప్రసాద్ రెడ్డిని, తన భార్యను బయటకు ఈడ్చుకొచ్చారు. అందరూ చూస్తుండగానే చెప్పుతో కొడుతూ, నిలదీస్తుంటే హరిప్రసాద్ రెడ్డి కనీసం ఎదురు చెప్పలేని స్థితిలో మౌనంగా ఉండిపోవడం అక్కడున్న […]

సైకిల్ కు ఓటు వేశారు..అభివృద్ధి చేసి చూపించాం: చంద్రబాబు

నూతన చరిత్రకు కుప్పం నుంచి శ్రీకారం చుట్టామని ఎపి సిఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. డ్వాక్రా మహిళలకు ఈ-సైకిళ్ల పంపిణీ చేశారు. శివపురం నుంచి తులసినాయనపల్లి ప్రజావేదిక వరకు ఈ-సైకిళ్ల ర్యాలీ నిర్వహించారు. కుప్పంలో 5,555 ఈ-సైకిళ్లు పంపిణీ చేసి చరిత్ర సృష్టించారని, ఇంటిపై ఉత్పత్తియ్యే విద్యుత్ తోనే సైకిల్ కు ఛార్జింగ్ చేసుకోవచ్చునని తెలియజేశారు. ఈ సూపర్ సైకిల్.. ఒక్క పైసా ఖర్చు లేకుండా ఎక్కడికైనా దూసుకెళ్తుందని, సైకిల్ కు ఓటు వేశారు.. అభివృద్ధి అంటే […]

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON