పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అత్యంత సన్నిహితుడు, వైసీపీ పబ్లిసిటీ వింగ్ వర్కింగ్ ప్రెసిడెంట్ హరిప్రసాద్ రెడ్డి ఒక మహిళతో కలిసి కారులో వెళ్తుండగా, తిరుపతి జిల్లాలోని ఒక గ్రామ వైసీపీ సర్పంచ్ అయినా ఆమె భర్త వారిని వెంబడించారు. ఉప్పరపల్లి వద్ద కారును అడ్డగించి, లోపల ఉన్న హరిప్రసాద్ రెడ్డిని, తన భార్యను బయటకు ఈడ్చుకొచ్చారు. అందరూ చూస్తుండగానే చెప్పుతో కొడుతూ, నిలదీస్తుంటే హరిప్రసాద్ రెడ్డి కనీసం ఎదురు చెప్పలేని స్థితిలో మౌనంగా ఉండిపోవడం అక్కడున్న వారిని ఆశ్చర్యపరిచింది.

