తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందంటూ చంద్రబాబు, పవన్ కల్యాణ్ చేసిన తప్పుడు ఆరోపణలపై వైసీపీ శనివారం పాప ప్రక్షాళన పూజలు నిర్వహించింది. రాష్ట్రవ్యాప్తంగా వేంకటేశ్వరస్వామి ఆలయాల్లోఈ కార్యక్రమాలను నిర్వహించింది . ఎన్టీఆర్ జిల్లాలో వైసీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్ ఆధ్వర్యంలో విశాఖపట్నం సీతమ్మధార వేంకటేశ్వరస్వామి ఆలయంలో ఎమ్మెల్సీ వరుదు కల్యాణి, మాజీ మేయర్ హరి వెంకట కుమారి ఆధ్వర్యంలో పూజలు నిర్వహించారు.

