loader

ఏం చేస్తున్నారు, ఇక సిద్దంగా ఉండండి – తేల్చి చెప్పిన చంద్రబాబు..!!

ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రులకు కీలక దిశా నిర్దేశం చేసారు. బెదిరింపు రాజకీయాలను తిప్పి కొట్టాలని సూచించారు. కేబినెట్ అజెండాతో సహా ప్రభుత్వంలోని కీలక అంశాలు నిర్ణయాల కు ముందే బయటకు వెళ్లటం పైన ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. మున్సిపల్ ఎన్నికల పైనా మంత్రులను సిద్దంగా ఉండాలని సూచించారు. సమాచారం లీక్ అయితే ఎన్టీఆర్ కేబినెట్ రద్దు చేసిన అంశాన్ని ప్రస్తావించారు. ఇదే సమయంలో అధికారుల తీరును తప్పు బట్టిన సీఎం.. కీలక ఆదేశాలు జారీ చేసారు.

బెంగాల్ ఎన్నికల్లో బీజేపీ భారీ మేనిఫెస్టో..

పశ్చిమ బెంగాల్ 2026 అసెంబ్లీ ఎన్నికలకు భారతీయ జనతా పార్టీ (బీజేపీ) తన అధికారిక మేనిఫెస్టో ‘సంకల్ప పత్రం’ను ఇవాళ విడుదల చేసింది. ప్రధాన హామీలు: మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం,ప్రతి నెల రూ.3000,5 సంవత్సరాల్లో 1 కోటి ఉద్యోగాలు, ఆలూ, మామిడి, ధాన్యం సాగుకు ప్రత్యేక పథకాలు,6 నెలల్లో యూనిఫాం సివిల్ కోడ్ (UCC) అమలు.ఆవుల స్మగ్లింగ్ పూర్తి నిర్మూలన. “ఇది సోనార్ బంగ్లా భరోసా బెంగాల్ అభివృద్ధి ఈ భరోసా ద్వారా మొదలవుతుంది” అని […]

వైఎస్‌ను గుర్తు చేసుకుని ఏడ్చిన బొత్స – అచ్చెన్నాయుడు విమర్శలపై ఆగ్రహం

ప్రెస్ మీట్ లో బొత్స వైఎస్ గురించి మాట్లాడుతూ ఆయనను గుర్తు చేసుకుని భావోద్వేగానికి గురై కన్నీరు పెట్టుకున్నారు. రాజకీయాల్లో అందరూ నీలాగే ఉంటారనుకుంటావా అని అచ్చెన్నాయుడుపై బొత్స మండిపడ్డారు. కూటమి నేతలు సంస్కారం లేకుండా రాజకీయం చేస్తున్నారని.. విమర్శించారు. అచ్చెన్నాయుడు కావాలనే జగన్ పై బురదచల్లుతున్నారని ఆరోపించారు. ఆయన దిగజారుడు మాటలు మాట్లాడకపోవడం మంచిదన్నారు. రాజకీయాలను నీతిగా చేయాలని బొత్స సలహా ఇచ్చారు. మావిగన్ వస్తున్న స్పందనను చూసే.. డైవర్ట్ రాజకీయాలు చేస్తున్నారని బొత్స ఆరోపించారు.

అస్సాంలో 75% పైగా పోలింగ్..

అస్సాం, కేరళ, పుదుచ్చేరి రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ అత్యంత భారీ స్థాయిలో కొనసాగుతోంది. ఓటర్లు ఉదయం నుంచే బారులు తీరి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఎన్నికల కమిషన్ వెల్లడించిన తాజా గణాంకాల ప్రకారం, సాయంత్రం 4:30 గంటల వరకు అస్సాం-75.91%, పుదుచ్చేరి – 72.40%, కేరళ – 62.71% నమోదైన పోలింగ్ కేరళ ఎర్నాకులం జిల్లాలో అత్యధికంగా 66% ఓటింగ్ నమోదైంది.పతనంతిట్టలో అత్యల్పంగా 59.25% నమోదవ్వగా, మిగిలిన అన్ని జిల్లాల్లో 60% పైగా పోలింగ్ […]

కేరళ ఎన్నికలు.. ఓటు వేసిన ప్రముఖులు

కేరళ వ్యాప్తంగా 30,495 పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ ప్రశాంతంగా సాగుతోంది. ముఖ్యమంత్రి పినరయి విజయన్ తన స్వగ్రామమైన పినరయిలోని ఆర్‌సి అమల పాఠశాలలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. సినీ తారలు మోహన్‌లాల్, పృథ్వీరాజ్ సుకుమారన్, ఆయన సతీమణి సుప్రియా మీనన్, ప్రముఖ నటుడు, కేంద్ర మంత్రి సురేష్ గోపి తదితరులు తమ ఓటు హక్కును వినియోగించుకున్న వారిలో ఉన్నారు. మోహన్ లాల్ తిరువనంతపురంలో, పృథ్వీరాజ్ కోచిలో ఓటు వేశారు.  సురేష్ గోపీ గురువాయూర్ లో తన ఓటు […]

మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌పై సీఎం చంద్రబాబు సీరియస్

ప్రభుత్వ అధికారిక కార్యక్రమాల్లో మంత్రి శ్రీనివాస్ తండ్రి జోక్యం చేసుకోవడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ వ్యవహారాలకు తన తండ్రిని దూరంగా ఉంచాలని సదరు మంత్రిని సీఎం గట్టిగా హెచ్చరించారు. ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే మంత్రి పదవి ఇచ్చి ప్రోత్సహించిన విషయాన్ని గుర్తు చేస్తూ, ఇకపై పనితీరులో మార్పు రావాలని స్పష్టం చేశారు. మంత్రి తండ్రి చేస్తున్న జోక్యంపై తన వద్ద పూర్తిస్థాయి నివేదికలు ఉన్నాయని చంద్రబాబు వెల్లడించారు.

అస్సాం, కేరళ, పుదుచ్చేరిలో కొనసాగుతున్న అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌

అస్సాం, కేరళ రాష్ట్రాలతోపాటు కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ కొనసాగుతోంది. ఉదయం నుంచే ఓటర్లు పోలింగ్‌ కేంద్రాల దగ్గర బారులుతీరి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. అస్సాంలో 126 అసెంబ్లీ స్థానాలకు, కేరళలో 140 అసెంబ్లీ స్థానాలకు, పుదుచ్చేరిలో 30 స్థానాలకు ఇవాళ పోలింగ్‌ నిర్వహిస్తున్నారు. మొత్తం 296 అసెంబ్లీ స్థానాల్లో పోలింగ్‌ జరుగుతోంది. కేరళలోని 140 నియోజకవర్గాలకు 30,495 కేంద్రాల్లో పోలింగ్‌ నిర్వహిస్తున్నారు. 2.71 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును […]

కడప ఫైర్ బ్రాండ్ నేతలపై లోకేష్ సీరియస్

నారా లోకేష్ బుధవారం టీడీపీ నాయకులతో సమీక్షా సమావేశంలో పలువురు నేతలపై మంత్రి లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. కేడర్‌తో మీటింగ్‌లు, గ్రీవెన్స్ కార్యక్రమాలు వరుసగా నాలుగు వారాలు నిర్వహించని నేతలను నారా లోకేష్ మందలించినట్లు సమాచారం. కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి, మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్‌, ప్రొద్దుటూరు నియోజకవర్గ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి, పులివెందుల టీడీపీ  ఇంఛార్జి బీటెక్ రవి, ధర్మవరం టీడీపీ ఇంఛార్జి పరిటాల శ్రీరామ్ మీద నారా లోకేష్ అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం.

టీవీకే విజయ్ ర్యాలీలో మళ్లీ అపశ్రుతి.. పలువురు కార్యకర్తలకు తీవ్ర గాయాలు..

తూత్తూకుడి నెల్లై హైవే మీద వాగైకులం సమీపంలో టీవీకే విజయ్ కాన్వాయ్ వెళ్తుంది. అప్పుడు పార్టీ కార్యకర్తలు టూవీలర్ మీద విజయ్ వాహనంకు దగ్గరగా వెళ్తున్నారు. ఇంతలో బ్యాలెన్స్ తప్పడంతో కొంత మంది టూవీలర్ వాహనాల నుంచి కింద పడిపోయారు. ఈ ఘటనలో పదుల సంఖ్యలో గాయపడ్డారు. వెంటనే టీవీకే విజయ్  తన కార్యకర్తల గురించి ఆరా తీశారు. ఈ ప్రమాదంలో కొంత మంది తీవ్రంగా గాయపడ్డారు. మరోవైపు వీరికి మెరుగైన వైద్యం అందించేలా చూడాలని టీవీకే […]

భవానీపుర్ అసెంబ్లీ స్థానానికి మమత నామినేషన్​- సువేందు అధికారితో మరోసారి ఢీ

బంగాల్​ రాజకీయాల్లో మరోసారి హైవోల్టేజ్ పోరుకు రంగం సిద్ధమైంది. రాష్ట్ర ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ భవానీపుర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బుధవారం తన నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. భారీ ర్యాలీ మధ్య అలిపుర్ సర్వే భవన్‌కు చేరుకున్న ఆమె, పార్టీ కార్యకర్తల నినాదాల నడుమ నామినేషన్ సమర్పించారు. కాళీఘాట్‌లోని తన నివాసం నుంచి ప్రారంభమైన రోడ్‌షోలో మమతా బెనర్జీ సుమారు 800 మీటర్లు నడుచుకుంటూ వెళ్లారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON