loader

కౌంటింగ్ లో కాంగ్రెస్ ఆధిక్యం

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. తొలి దశలో లెక్కించిన పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యత చూపినట్లు సమాచారం. పోస్టల్ బ్యాలెట్ ఫలితాల ప్రకారం ఖమ్మం జిల్లా ఏదులాపురం, మధిర, నాగర్‌కర్నూల్, సంగారెడ్డి, మంచిర్యాల, లక్షెట్టిపేట, చెన్నూరు, ఆసిఫాబాద్ వంటి ప్రాంతాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. దిలా ఉండగా నిర్మల్, ఖానాపూర్‌, కాగజ్‌నగర్ వంటి పట్టణాల్లో బీజేపీ అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఈ ప్రాంతాల్లో ప్రధాన పార్టీల మధ్య గట్టి […]

మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభం

మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. తెలంగాణ వ్యాప్తంగా 103 సెంటర్లలో ఓట్లను లెక్కిస్తున్నారు. మూడు గంటలలోపు మున్సిపాలిటీల ఫలితాలు, రాత్రిలోపు కార్పొరేషన్‌ల ఫలితాలు వెల్లడికానున్నాయి. 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్‌లలో ఎన్నికలు జరగ్గా ఎవరికీ వారే గెలుపు అంచనాలతో క్యాంపు రాజకీయాలకు తెరతీశారు.

NTRకు భారతరత్న ఇవ్వాలి: సీఎం రేవంత్

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, నటుడు మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌కు భారతరత్న పురస్కారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. గురువారం ఢిల్లీలో నిర్వహించిన మీడియా చిట్ చాట్‌లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘ఎన్టీఆర్ జాతీయ నాయకుడు. ఎన్టీఆర్ గురించి ఎవరైనా తక్కువగా మాట్లాడితే వారంత మూర్ఖులు ఎవరు ఉండరు. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తాం. పార్లమెంట్‌లో ఎన్టీఆర్ విగ్రహం పెట్టిందే కాంగ్రెస్ పార్టీ’ అని అన్నారు.

సవాళ్లు-ప్రతిసవాళ్లతో దద్దరిల్లిన మండలి – గవర్నర్ ప్రసంగంపై వాడీవేడి చర్చ

గవర్నర్ ప్రసంగంపై ధన్యాదాలు తెలిపే తీర్మానంపై శాసన మండలిలో అధికార, విపక్షాల మధ్య వాడీ వేడీ చర్చ జరిగింది. పరస్పరం సవాళ్లు ప్రతిసవాళ్లతో సభ దద్దరిల్లింది. గవర్నర్ ప్రసంగంలోని అంశాలపై వైఎస్సార్సీపీ సభ్యులు విమర్శలు చేయగా ఆరోపణలను అధికారపార్టీ సభ్యులు దీటుగా తిప్పి కొట్టారు. ఆరోపణలు నిరూపించేందుకు తాము సిద్దమని వైఎస్సార్సీపీ సభ్యులు సవాల్ విసరగా, దమ్ముంటే నిరూపించాలని దీనికి తాముసైతం సిద్దమని అధికారపార్టీ నేతలు ప్రతిసవాల్ విసిరారు.

టీడీపీ ఎమ్మెల్యేకు సీరియస్ వార్నింగ్.. పద్ధతి మార్చుకోవాలి, ఇదే ఫైనల్ ఛాన్స్

టీడీపీ ఎమ్మెల్యేకు పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ఏపీ అసెంబ్లీ లాబీల్లో ఇద్దరు నేతలు మాట్లాడుకున్నారు.. ఇకపై పద్ధతి మార్చుకోవాలని పల్లా ఎమ్మెల్యేకు చెప్పారు. కొంతకాలంగా ఎన్టీఆర్ జిల్లా తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు వరుసగా వివాదాల్లో చిక్కుకుంటున్నారు. సొంత పార్టీ నేతలపై ఆరోపణలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. శ్రీనివాస్ వ్యవహరిస్తున్న తీరుపై విమర్శలు వస్తుండటంతో.. అధినేత చంద్రబాబు ఆదేశాలతో పల్లా హెచ్చరించారు.

డిప్యూటీ సీఎంను కలిసిన బాలకృష్ణ, నాగబాబు

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌ను హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, జనసేన ఎమ్మెల్సీ నాగబాబు వేర్వేరుగా కలిశారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఉప ముఖ్యమంత్రి ఛాంబర్‌లో బాలకృష్ణ మర్యాదపూర్వకంగా కలిశారు. ఇరువురు ప్రస్తుత పరిణామాలు, వివిధ అంశాలపై చర్చించినట్లుగా సమాచారం. ఆ తర్వాత నాగబాబు కూడా సోదరుడిని కలిశారు. హిందూపురం నియోజకవర్గానికి సంబంధించిన అంశాలతోపాటు తాజా రాజకీయ పరిణామాలపైనా ఇద్దరి మధ్య చర్చ […]

బంగ్లాదేశ్‌లో పోలింగ్ ప్రారంభం- హసీనా పార్టీ లేకుండా తొలి ఎన్నిక ఇదే

ఏడాదిన్నరగా రాజకీయ అస్థిరతను ఎదుర్కొంటున్న బంగ్లాదేశ్‌లో గురువారం 13వ జాతీయ పార్లమెంట్ ఎన్నికల ఓటింగ్ ప్రారంభమైంది. మాజీ ప్రధాని షేక్ హసీనా నేతృత్వంలోని అవామీ లీగ్ ప్రభుత్వం 2024 ఆగస్టులో విద్యార్థుల భారీ ఉద్యమంతో కూలిపోయిన తర్వాత ఏర్పడిన తాత్కాలిక పాలనకు ఇవి ముగింపు పలకనున్నాయి. ఈసారి 299 పార్లమెంట్ స్థానాలకు 1,981 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు.  బంగ్లాదేశ్ రాజకీయాల్లో ప్రభావం చూపిన ప్రధాన పార్టీ       అవామీ లీగ్‌ లేకుండా ఎన్నికలు జరగడం ఇదే […]

మావోల బెదిరింపులు.. ఎపి మంత్రుల ఇంటి వద్ద భద్రత కట్టుదిట్టం

ఎపిలో ఒకేసారి నలుగురు మంత్రులకు మావోయిస్టుల పేరుతో బెదిరింపు లేఖలు రావడం చర్చనీయాంశమైంది. రాష్ట్ర మంత్రులు అనగాని సత్యప్రసాద్, కొల్లు రవీంద్ర, సత్య కుమార్ యాదవ్, కందుల దుర్గేష్‌లకు మావోయిస్టుల నుంచి బెదిరింపు లేఖలు వచ్చాయి. అసలు కారకులను గుర్తించేందుకు పోలీసులు, ఇంటెలిజెన్స్ రంగంలోకి దిగాయి. మరోవైపు మంత్రుల భద్రతను పర్యవేక్షించే అధికారులు కూడా ఈ లేఖల అసలు మూలాలను ఆరా తీస్తున్నారు. మావోయిస్టుల లేఖలు వచ్చి న కారణంగా ఆ నలుగురు మంత్రుల నివాసాల వద్ద […]

అంబటి రాంబాబుకు షాకిచ్చిన పోలీసులు – మరో కేసులో పీటీ వారెంట్ దాఖలు

మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అంబటి రాంబాబుకు కోర్టులో ఊరట లభించిన కొద్ది గంటల్లోనే మళ్ళీ చిక్కులు మొదలయ్యాయి. ఆయన జైలు నుంచి విడుదల కాకుండానే సత్తెనపల్లి పోలీసులు గుంటూరు సబ్ కోర్టులో మరో పీటీ వారెంట్ దాఖలు చేశారు. 2023 నాటి సంక్రాంతి లక్కీ డ్రా అవినీతి కేసులో ఆయనను విచారించాల్సి ఉందని పోలీసులు పేర్కొనడంతో ఆయన విడుదలపై సందిగ్ధత నెలకొంది.

ప్రతి ఒక్కరూ కూటమి ధర్మానికి కట్టుబడి ఉండాలి…మరో 15 ఏళ్లు కూటమి కొనసాగాలి: సీఎం, డిప్యూటీ సీఎం

రాష్ట్రంలో మరో 15 ఏళ్ల పాటు కూటమి ఐక్యత ఇలాగే కొనసాగాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అన్నారు. ఈ 20 నెలల్లో కూటమి నాయకత్వంలో ఎక్కడా విభేదాలు ఏర్పడలేదని… ఇది శుభ పరిణామమని చెప్పిన సీఎం ఇదే ఐక్యత ఇకపైనా కొనసాగాలని, అప్పుడే రాష్ట్రాభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. ఈ 20 నెలల్లో చాలా కష్టపడి, ఐక్యంగా పని చేశామని సమావేశంలో పవన్ కల్యాణ్ అన్నారు. రాష్ట్రాభివృద్ధి కోసం 15 ఏళ్లు కూటమి కలిసి ఉంటుందని, ఐక్యంగా ముందుకు వెళతుందని […]

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON