loader

ఢిల్లీలో ఉండే మోడీ రండీ తేల్చుకుందాం..రేవంత్

తెలంగాణలో రైతు సంక్షేమంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో ఎవరు ఎంత చేశారో తేల్చుకోవాలని బీఆర్ఎస్, బీజేపీ నేతలను బహిరంగ చర్చకు ఆహ్వానించారు. “ కేడీ గల్లీలో ఉన్నా, మోడీ ఢిల్లీలో ఉన్నా… రైతు సమస్యలపై ముఖాముఖీకి రావాలండి” అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.కేవలం తొమ్మిది రోజుల్లో 9 వేల కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో జమ చేయడం తమ ప్రభుత్వ విజయాన్ని చూపుతున్నదని సీఎం స్పష్టం చేశారు.

లెక్క తక్కువైతే క్షమాపణలకు రెడీ: సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ సామాజిక న్యాయ సమర భేరి సభలో మాట్లాడుతూ.. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగ నియామకాలకు ప్రాధాన్యత ఇచ్చిందని స్పష్టం చేశారు. తమ ప్రభుత్వం కేవలం ఏడాది కాలంలోనే 60,000 ప్రభుత్వ ఉద్యోగ నియామకాలను పూర్తి చేసిందని ఆయన వెల్లడించారు. ఈ లెక్కల్లో ఏమైనా తేడా ఉంటే.. నేను క్షమాపణలు చెప్పడానికైనా సిద్ధం అని బీజేపీ, బీఆర్ఎస్ నాయకులకు సవాల్ విసిరారు.

తెలంగాణలో 13 పార్టీలకు ఈసీ షాక్

తెలంగాణలో పలు రాజకీయ పార్టీలపై రాష్ట్ర ఎన్నికల సంఘం కీలక చర్యలు చేపట్టింది. గత ఆరేళ్లుగా ఎలాంటి ఎన్నికల్లోనూ పోటీ చేయకుండా, కేవలం రిజిస్టర్డ్ పార్టీలుగా మాత్రమే కొనసాగుతున్న 13 పార్టీలకు శుక్రవారం షోకాజ్ నోటీసులు జారీ చేసింది. పార్టీ గుర్తింపును ఎందుకు రద్దు చేయకూడదో స్పష్టమైన కారణాలతో వివరణ ఇవ్వాలని ఈ నోటీసుల్లో ఆదేశించింది. రాష్ట్రంలో ఎన్నికల సంఘం వద్ద రిజిస్టర్ అయి ఉండి ఆరేళ్లకు పైగా ఏ ఎన్నికల బరిలోనూ నిలవని పార్టీలను జాబితా […]

సాధారణ స్థితికి చేరుకున్న కేసీఆర్ హెల్త్ కండీషన్

సీజనల్ ఫీవర్ రావడంతో కాస్త నీరసానికి గురైన కేసీఆర్‌ను హెల్త్ చెకప్, వైద్య పరీక్షల నిమిత్తం డాక్టర్లు తమ పర్యవేక్షణలో ఉంచి ట్రీట్ మెంట్ అందించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం సాధారణ స్థితికి చేరుకున్నట్లుగా పార్టీ శ్రేణులు, ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. కేసీఆర్ ఆరోగ్యం బాగోలేదని తెలిసి చాలా మంది బీఆర్ఎస్ శ్రేణులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు యశోధ ఆసుపత్రికి వచ్చారు. ఆయన్ని పరామర్శించేందుకు వచ్చిన ఆరోగ్యం నిలకడగా ఉండటం చూసి హ్యాపీగా ఫీలయ్యారు.

కాబోయే ముఖ్యమంత్రి హీరో విజయ్‌.. టీవీకే పార్టీ సంచలన ప్రకటన

సినీ నటుడు విజయ్‌ సంచలనం నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యమంత్రి రేసులో తాను ఉండాలని నిర్ణయించుకున్నారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలపై తమిళగ వెట్రి కళగం పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. రానున్న ఎన్నికల్లో తమ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా టీవీకే వ్యవస్థాపకుడు, సినీ నటుడు విజయ్‌ను ప్రకటించింది. చెన్నైలో శుక్రవారం పార్టీ ఎగ్జిక్యూటివ్‌ సమావేశం జరిగింది. అసెంబ్లీ ఎన్నికలపై వ్యవహరించాల్సిన తీరుపై సమావేశంలో పార్టీ కార్యవర్గం చర్చించింది. ఎన్నికలకు ఎలా సంసిద్ధం కావాలని చర్చ జరిగింది.

బైరెడ్డి శబరి ఆత్మకూరు పర్యటనలో ఉద్రిక్తత

టీడీపీ ఎంపీ బైరెడ్డి శబరి శ్రీశైలం నియోజకవర్గంలో పర్యటించిన సమయంలో చేదు అనుభవం ఎదురైంది. ఆత్మకూరులోని మాజీ మంత్రి ఏరాసు ప్రతాపరెడ్డి ఇంటిపై ఎమ్మెల్యే అను చరులు రాళ్లదాడికి పాల్పడినట్లు సమాచారం. రంగంలోకి దిగిన పోలీసులు టీడీపీ కార్యకర్తలను చెదరగొట్టి.. మాజీ మంత్రిని ప్రత్యేక వాహనంలో అక్కడి నుంచి మరో చోటుకి తరలించారు. నియోజకవర్గానికి వచ్చే ముందు ఎమ్మెల్యేకు కనీసం సమాచారం అందించాలని, కార్యక్రమాలలో ఎమ్మెల్యే హాజరు కావాల్సి ఉంటుందని బుద్ధారాజశేఖర్ రెడ్డి అనుచరులు బైరెడ్డి శబరిని […]

కొణిజేటి రోశయ్య విగ్రహాన్ని ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి, మల్లికార్జున ఖర్గే

హైదరాబాద్ లోని లక్డీకాపూల్‌లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం కొణిజేటి రోశయ్య కాంస్య విగ్రహాన్ని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆవిష్కరించారు. కొణిజేటి రోశయ్య 92వ జయంతి సందర్భంగా కాంగ్రెస్ నేతలు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి మాజీ సీఎంకు ఘన నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు భట్టి విక్రమార్క, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, శ్రీధర్‌బాబు, టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌కుమార్‌ గౌడ్‌ తో పాటు రోశయ్య కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

వైఎస్ జగన్‌తో వల్లభనేని వంశీ భేటీ…

వల్లభనేని వంశీకి 137 రోజుల అనంతరం బెయిల్ లభించింది. దీంతో జూలై 2న వల్లభనేని వంశీ మోహన్ బెయిల్‌పై విజయవాడ సబ్‌జైలు నుంచి విడుదల అయ్యారు. వల్లభనేని వంశీ తన సతీమణి పంకజశ్రీతో కలిసి తాడేపల్లిలోని మాజీ సీఎం వైఎస్ జగన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. మాజీ సీఎం వైఎస్ జగన్‌తో వల్లభనేని వంశీ దంపతులు పలు అంశాలపై చర్చించారు. జైలుకు వెళ్లిన తర్వాత జరిగిన పరిణామాలు, వరుస కేసుల నమోదు వంటి అంశాలపై చర్చించుకున్నట్లు తెలుస్తోంది.

నేనే సిఎంగా కొనసాగుతా: సిద్దరామయ్య

నాయకత్వం మార్పుపై ఊహాగానాలను కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య మరో సారి తోసిపుచ్చారు. ఐదేళ్ల పాటు పూర్తి పదవికాలం తాను సిఎంగా కొనసాగుతానని స్పష్టం చేశారు. మీకు ఏమైనా సందేహం ఉందా అని మీడియాను నిలదీశారు. కాగా, తనకు మరో గత్యంతరం లేదని, తాను ఆయనకు మద్దతు ఇవ్వాలని, హైకమాండ్ నిర్ణయమే తనకు శిరోధార్యం అని డిప్యూటీ సిఎం డికె శివకుమార్ అన్నారు. కర్ణాటకలో నాయకత్వం మారబోవడం లేదని కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ రణదీప్ సుర్జేవాలా ప్రకటన వెలువడడం […]

తెలంగాణలో చంద్రబాబు కోవర్టులు..కాంగ్రెస్ MLA

బనకచర్ల వివాదం నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు తెలంగాణలో కోవర్ట్‌లు ఉన్నారని ఆరోపించారు. ఇరిగేషన్ ప్రాజెక్టులు, రోడ్డు కాంట్రాక్టులు చూసేది వాళ్లేనని.. ఆ కోవర్ట్‌లకు కరెంట్, నల్లా కనెక్షన్‌లు కట్ చేయాలని సూచించారు. ఇరిగేషన్ ప్రాజెక్టుల డబ్బులు ఇవ్వపోతే.. వాళ్లే చంద్రబాబు వద్దకు వెళ్లి బనకచర్ల బంద్ పెట్టిస్తారన్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON