సీజనల్ ఫీవర్ రావడంతో కాస్త నీరసానికి గురైన కేసీఆర్‌ను హెల్త్ చెకప్, వైద్య పరీక్షల నిమిత్తం డాక్టర్లు తమ పర్యవేక్షణలో ఉంచి ట్రీట్ మెంట్ అందించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం సాధారణ స్థితికి చేరుకున్నట్లుగా పార్టీ శ్రేణులు, ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. కేసీఆర్ ఆరోగ్యం బాగోలేదని తెలిసి చాలా మంది బీఆర్ఎస్ శ్రేణులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు యశోధ ఆసుపత్రికి వచ్చారు. ఆయన్ని పరామర్శించేందుకు వచ్చిన ఆరోగ్యం నిలకడగా ఉండటం చూసి హ్యాపీగా ఫీలయ్యారు.

