టీడీపీ ఎంపీ బైరెడ్డి శబరి శ్రీశైలం నియోజకవర్గంలో పర్యటించిన సమయంలో చేదు అనుభవం ఎదురైంది. ఆత్మకూరులోని మాజీ మంత్రి ఏరాసు ప్రతాపరెడ్డి ఇంటిపై ఎమ్మెల్యే అను చరులు రాళ్లదాడికి పాల్పడినట్లు సమాచారం. రంగంలోకి దిగిన పోలీసులు టీడీపీ కార్యకర్తలను చెదరగొట్టి.. మాజీ మంత్రిని ప్రత్యేక వాహనంలో అక్కడి నుంచి మరో చోటుకి తరలించారు. నియోజకవర్గానికి వచ్చే ముందు ఎమ్మెల్యేకు కనీసం సమాచారం అందించాలని, కార్యక్రమాలలో ఎమ్మెల్యే హాజరు కావాల్సి ఉంటుందని బుద్ధారాజశేఖర్ రెడ్డి అనుచరులు బైరెడ్డి శబరిని నిలదీశారు

