వల్లభనేని వంశీకి 137 రోజుల అనంతరం బెయిల్ లభించింది. దీంతో జూలై 2న వల్లభనేని వంశీ మోహన్ బెయిల్‌పై విజయవాడ సబ్‌జైలు నుంచి విడుదల అయ్యారు. వల్లభనేని వంశీ తన సతీమణి పంకజశ్రీతో కలిసి తాడేపల్లిలోని మాజీ సీఎం వైఎస్ జగన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. మాజీ సీఎం వైఎస్ జగన్‌తో వల్లభనేని వంశీ దంపతులు పలు అంశాలపై చర్చించారు. జైలుకు వెళ్లిన తర్వాత జరిగిన పరిణామాలు, వరుస కేసుల నమోదు వంటి అంశాలపై చర్చించుకున్నట్లు తెలుస్తోంది.

