మాజీమంత్రి ప్రసన్నకుమార్ రెడ్డిపై కేసు నమోదు
మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డిపై కోవూరు పోలీస్ స్టేషన్‌లో పలు సెక్షన్ల కింద కేసు నమోదు అయ్యింది. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి పై చేసిన అనుచిత వ్యాఖ్యలపై మహిళల ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు. మాజీమంత్రి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిపై సెక్షన్ 74, 75, 79, 296 కింద పోలీసులు కేసులు నమోదు చేశారు. మాజీమంత్రి ప్రసన్న కుమార్ రెడ్డికి పోలీసులు నోటీసులు జారీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

