చిత్తూరు జిల్లాలో మామిడి రైతుల సమస్యలు తెలుసుకునేందుకు ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బంగాళరుపాళ్యానికి వెళ్లారు. చంద్రగిరి యువజన విభాగం కార్యదర్శిపై పోలీసులు లాఠీచార్జ్ చేశారని వైసీపీ అధినేత జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల లాఠీచార్జ్ లో యువజన విభాగం కార్యదర్శి శశిధర్ రెడ్డి తలకు గాయమైందని ఆరోపించారు. గాయపడ్డ కార్యకర్త దగ్గరికి వెళ్లేందుకు జగన్ ప్రయత్నం చేయగా.. చిత్తూరు ఎస్పీ మణికంఠ తిరిగి కాన్వాయ్‌లో జగన్‌ను ఎక్కించి, అక్కడి నుంచి పంపించివేశారు.

