విజయ్‌పై పవన్ కళ్యాణ్ ప్రశంసలు కురిపించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. “ఎన్నికల్లో విజయం సాధించిన టీవీకేకు, ఆ పార్టీ అధినేత విజయ్‌కు ప్రత్యేక అభినందనలు. విజయ్ పార్టీ ఈ ఎన్నికల్లో అద్భుత విజయాన్ని సాధించింది. ఎన్నికల్లో పోటీ చేసిన తొలిసారే ప్రజలకు నమ్మకమైన ప్రత్యామ్నాయంగా నిలిచింది. ఇది మార్పు కావాలన్న తమిళ ప్రజల ఆకాంక్షలకు అద్దం పడుతోంది. తమిళనాడు ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా..విజయ్ నిబద్ధత, బాధ్యతతో పనిచేస్తారని ఆశిస్తున్నా” అంటూ పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు.

