విజయ్ కారు డ్రైవర్ కొడుకు శభరినాథన్ విజయం సాధించడం చర్చనీయాంశమవుతోంది. విరుగంబాక్కం నియోజకవర్గం నుంచి తన వ్యక్తిగత కారు డ్రైవర్, పీఏ అయిన రాజేంద్రన్ కుమారుడు శభరినాథన్ కు అవకాశం ఇచ్చాడు. అతడిని భారీ మెజారిటీతో గెలిపించుకున్నారు. ప్రత్యర్థి పార్టీల దిగ్గజాలకు దీటుగా శభరినాథన్ ను బరిలోకి దించారు. ఈ ఎన్నికల్లో డీఎంకే అభ్యర్థి ప్రభాకర రాజాపై శభరినాథన్ అద్భుత విజయం సాధించి, శాసనసభలో అడుగుపెడుతున్నారు.

