సివిల్ సప్లై కార్పోరేషన్ లో భారీ కుంభకోణం జరిగిందని, అందుకే రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లు నత్తనడకన సాగుతున్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రైతుని చచ్చేవరకు వేధిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సదాశివపేటలో శనగ పంట తెచ్చి నెల రోజులైనా ఇప్పటివరకు పంట కొనుగోలు చేయలేదన్నారు. వారం రోజుల్లో అన్ని కొనుగోలు కేంద్రాలు తిరిగి రైతులకు ధైర్యం చెబుతామని, తహశీల్దార్ కార్యాలయాల వద్ద ధర్నాలు చేస్తామన్నారు. ధాన్యం కొనుగోలు చేసే వరకు ప్రభుత్వాన్ని నిలదిస్తామని కేటీఆర్ హెచ్చరించారు.

