వైఎస్ రాజశేఖర్ రెడ్డి 76వ జయంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల నివాళులు అర్పించారు. వైఎస్సార్ జయంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ పక్షాన నివాళులు అర్పిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలోనే కాదు, దేశంలోనూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కీలక పాత్ర పోషించారంటూ కొనియాడారు. వైఎస్సార్ జ్ఞాపకార్థం హైదరాబాద్లో ఓ స్మృతివనం ఏర్పాటు చేయాలని షర్మిల కోరారు. ఇది వైఎస్సార్ అభిమానులు, ప్రజల పక్షాన తెలంగాణ ప్రభుత్వానికి తన విజ్ఞప్తన్నారు.

