loader

ప్రతిపక్ష నాయకుడిని చూసి చంద్రబాబుకు భయమెందుకు ? : వైఎస్‌ జగన్‌

ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిపక్ష నాయకుడినైన తనను చూసి ఏపీ సీఎం చంద్రబాబు భయపడుతున్నారని వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి అన్నారు. తన పర్యటనకు వేలాదిమంది పోలీసులను మోహరించి తన అభిమానులను అడ్డుకోవడంపై మండిపడ్డారు. రాష్ట్రంలో ఎమర్జెన్సీ పరిస్థితులు కనిపిస్తున్నాయని ఆరోపించారు. తన పర్యటనను అడ్డుకోవడానికి అనేక ఆంక్షలు విధిస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో రెడ్‌బుక్‌ రాజ్యాంగం నడుస్తుందని సూపర్‌సిక్స్‌ హామీల గురించి ప్రశ్నించే గొంతులను నొక్కెస్తున్నారని దుయ్యబట్టారు.

పార్టీ ముఖ్య నేతలతో కేసీఆర్ భేటీ

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఎర్రవెల్లిలోని తన నివాసంలో కీలక సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో కేటీఆర్, హరీశ్ రావు, జగదీశ్ రెడ్డి తదితర పార్టీ ముఖ్యనేతలు హాజరయ్యారు. రాష్ట్ర రాజకీయ పరిణామాల నేపథ్యంలో, ప్రత్యేకంగా ఎమ్మెల్యేల అనర్హత అంశంపై ఈ సమావేశం నిర్వహించినట్లు సమాచారం. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై స్పీకర్ నిర్ణయానికి గడువు నిర్ణయించడంతో, ఆయా స్థానాల్లో ఉప ఎన్నికలు తథ్యం కానున్నాయన్న అంచనాలు వ్యక్తమవుతున్నాయి.

ఆసుపత్రి నుంచి ముద్రగడ పద్మనాభం డిశ్చార్జ్.. కుటుంబసభ్యులు, అభిమానుల్లో హర్షం

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రముఖ నేత, మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఆసుపత్రి చికిత్స అనంతరం డిశ్చార్జ్ అయ్యారు. రెండు వారాలుగా అనారోగ్యంతో బాధపడుతున్న ముద్రగడ త్వరితగతిన కోలుకోవడంతో కుటుంబ సభ్యులు, ఆయన అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ విషయాన్ని ఆయన కుమారుడు, ప్రత్తిపాడు నియోజకవర్గ వైసీపీ కో-ఆర్డినేటర్ ముద్రగడ గిరి మీడియాకు తెలిపారు.

క్వార్ట్జ్ బిజినెస్‌ను వదిలేస్తున్నా:ఎంపీ వేమిరెడ్డి

క్వార్ట్జ్ ఎక్స్ పోర్ట్స్ విషయంలో తప్పుడు ప్రచారాలపై నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కొట్టి పడేశారు. ఇకపై క్వార్జ్ కి తనకు ఎలాంటి సంబంధం లేదని, కంపెనీ పెట్టాలన్న ఆలోచనను విరమించుకుంటున్నట్లు ప్రకటించారు. చట్టబద్దంగా ఈ ఏడాది కాలంలో నా కంపెనీల ద్వారా 19 వేల టన్నులను ఎగుమతి చేస్తే తాను కోట్లు కొల్లగొట్టానని ఆరోపణలు చేయడం సిగ్గు చేటన్నారు.

ఆంక్షల మధ్య కొనసాగుతున్న జగన్ నెల్లూరు పర్యటన

హెలికాప్టర్‌లో నెల్లూరు చేరుకున్న జగన్‌ను చూసేందుకు భారీ ఎత్తున జనం, కార్యకర్తలు ముందుకొచ్చారు. దీంతో హెలిపాడ్‌ దగ్గరకు అనుమతి లేదంటూ వచ్చిన కార్యకర్తలను పోలీసులు తరిమేశారు. అక్కడి నుంచి జగన్‌ కాన్వాయ్‌లో మాజీ మంత్రి కాకాణి గోవర్దన్‌రెడ్డితో నెల్లూరు జైలులో ములాఖత్ అయ్యి ఆయనను పరామర్శించారు. తర్వాత జగన్ మాజీ ఎమ్మెల్యే ప్రసన్నకుమార్‌రెడ్డి ఇంటికి బయల్దేరారు. ఈ క్రమంలో జగన్‌ చూసేందుకు వచ్చిన వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, ప్రజలపై పోలీసుల లాఠీఛార్జ్‌ చేశారు. పోలీసుల తీరుకు నిరసనగా ప్రసన్నకుమార్ […]

సీఎం రేవంత్ రెడ్డికి బిగ్ షాక్.. 10 మంది ఎమ్మెల్యేల పిరాయింపుపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు

తెలంగాణలో 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌పై సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. ఆనర్హత అంశంపై స్పీకర్ 3 నెలల్లో నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. అంటే.. అక్టోబర్ 31 లోగా స్పీకర్ దీనిపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. సుప్రీంకోర్టులో ఈ కేసును విచారించిన జస్టిస్ బి.ఆర్. గవాయ్, జస్టిస్ ఆగస్టిన్ జార్జ్ మసీహ్‌ల ధర్మాసనం, స్పీకర్ నిర్ణయం తీసుకోకుండా జాప్యం చెయ్యడంపై అసంతృప్తి వ్యక్తం చేసింది.

రేపు జగన్ పర్యటన పై సోమిరెడ్డి స్పందన

వైసీపీ అధినేత జగన్ రేపు నెల్లూరు పర్యటన కు వస్తుండటంపై టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి రేపు జగన్ పర్యటన పై సోమిరెడ్డి స్పందన తీవ్రంగా స్పందించారు. జగన్ ఏ ముఖంతో నెల్లూరు వస్తున్నారని ఆయన ప్రశ్నించారు.జగన్ మాట విని అనేక మంది అధికారులు సమస్యలు ఎదుర్కొన్నారని సోమిరెడ్డి తెలిపారు. వారి సమస్యలను పట్టించుకోకుండా కాకాణిని పరామర్శించడానికి రావడం సరికాదన్నారు. లిక్కర్ స్కాంలో జైలుకెళ్లిన మిథున్ రెడ్డి, రాజ్ కెసిరెడ్డి, ధనంజయరెడ్డిలను కూడా జగన్ […]

దటీజ్ రాహుల్.. 22 మంది చిన్నారులను దత్తత తీసుకోనున్న కాంగ్రెస్ అగ్రనేత

జమ్మూకశ్మీర్‌లోని పూంఛ్ జిల్లాలో ఆపరేషన్ సిందూర్ సమయంలో జరిగిన హింసాత్మక ఘటనల్లో తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారుల విషయంలో కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ గొప్ప మనసు చాటుకున్నారు. పూంఛ్‌లోని క్రైస్ట్ పబ్లిక్ స్కూల్‌ను సందర్శించారు. అక్కడ తల్లిదండ్రులను కోల్పోయిన విద్యార్థులను కలుసుకుని వారి పరిస్థితి తెలుసుకుని ఈ సంఘటనలో ప్రభావితమైన 22 మంది చిన్నారులను రాహుల్ దత్తత తీసుకోనున్నారు. రాహుల్ గాంధీ వారు పిల్లలు గ్రాడ్యుయేషన్ పూర్తిచేసే వరకు వారి విద్య, వైద్యం, జీవనోపాధి ఖర్చులను […]

ఆ ఈవెంట్ కు నా అనుమతి లేదు… నందమూరి బాలకృష్ణ

సోషల్ మీడియాలో తన పేరు అడ్డంపెట్టుకుని జరుగుతున్న ప్రచారాన్ని ప్రముఖ సినీ నటుడు, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఖండించారు. ‘‘బంగారు బాలయ్య – బసవతారకం ఈవెంట్’’ పేరుతో అశ్విన్ అట్లూరి అనే విరాళాలు సేకరిస్తున్నట్టుగా తెలిసిందని.. అయితే ఆ ఈవెంట్‌కు తన అనుమతి లేదని తెలిపారు. బసవతారకం ఆస్పత్రి ట్రస్టు బోర్డు నుంచి ఎటువంటి అధికారిక ఆమోదం లేదని చెప్పారు. ఈ రకమైన అనధికారిక, తప్పుదారి పట్టించే కార్యక్రమాల పట్ల అప్రమత్తంగా ఉండాలని తన అభిమానులను, […]

సివిల్ సప్లై స్కాం అరోపణలు.. రేవంత్, ఉత్తమ్ పై ఇడికి బిఆర్‌ఎస్ ఫిర్యాదు

రాష్ట్ర సివిల్ సప్లైస్ స్కాంలో సిఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, సంబంధిత అధికారులు ప్రత్యక్షంగా పాల్గొన్నారని బిఆర్‌ఎస్ సీనియర్ నేత పెద్దిరెడ్డి సుదర్శన్ రెడ్డి ఆరోపించారు. ఈ కుంభకోణంలో రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డినే ప్రధాన పాత్రధారులు అని పేర్కొన్నారు అక్రమంగా డబ్బులు చేరిన 187 ఖాతాల వివరాలను సేకరించామని తెలిపారు. ఇందులో మనీలాండరింగ్ జరిగిందని పేర్కొన్నారు. తాము సేకరించిన ఆధారాలతో ఇడికి,  సిబిఐ, డైరెక్టరేట్ ఆప్ ఇంటెలిజెన్స్‌కు ఫిర్యాదు చేశామని […]

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON