జమ్మూకశ్మీర్‌లోని పూంఛ్ జిల్లాలో ఆపరేషన్ సిందూర్ సమయంలో జరిగిన హింసాత్మక ఘటనల్లో తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారుల విషయంలో కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ గొప్ప మనసు చాటుకున్నారు. పూంఛ్‌లోని క్రైస్ట్ పబ్లిక్ స్కూల్‌ను సందర్శించారు. అక్కడ తల్లిదండ్రులను కోల్పోయిన విద్యార్థులను కలుసుకుని వారి పరిస్థితి తెలుసుకుని ఈ సంఘటనలో ప్రభావితమైన 22 మంది చిన్నారులను రాహుల్ దత్తత తీసుకోనున్నారు. రాహుల్ గాంధీ వారు పిల్లలు గ్రాడ్యుయేషన్ పూర్తిచేసే వరకు వారి విద్య, వైద్యం, జీవనోపాధి ఖర్చులను భరించనున్నారని తెలిపారు.

