రాష్ట్ర సివిల్ సప్లైస్ స్కాంలో సిఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, సంబంధిత అధికారులు ప్రత్యక్షంగా పాల్గొన్నారని బిఆర్‌ఎస్ సీనియర్ నేత పెద్దిరెడ్డి సుదర్శన్ రెడ్డి ఆరోపించారు. ఈ కుంభకోణంలో రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డినే ప్రధాన పాత్రధారులు అని పేర్కొన్నారు అక్రమంగా డబ్బులు చేరిన 187 ఖాతాల వివరాలను సేకరించామని తెలిపారు. ఇందులో మనీలాండరింగ్ జరిగిందని పేర్కొన్నారు. తాము సేకరించిన ఆధారాలతో ఇడికి, సిబిఐ, డైరెక్టరేట్ ఆప్ ఇంటెలిజెన్స్‌కు ఫిర్యాదు చేశామని చెప్పారు.

