loader

అబార్షన్ చేయించుకోకపోతే నిన్ను చంపేస్తా.. మహిళను బెదిరించిన కాంగ్రెస్ ఎమ్మెల్యే

కేరళ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే దారుణాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే ఓ సినిమా నటి.. తనను వేధించాడని ఆరోపణలు చేయగా నటిని వేదించింది ఎమ్మెల్యే రాహుల్ మామ్‌కూటథిల్ అంటూ పెద్ద ఎత్తున ధర్నాలు, రాస్తారోకోలు చేయగా ఆయన అన్ని పార్టీ పదవుల నుంచి రాజీనామా చేశారు. మరో ఆడియో క్లిప్ లో ఎమ్మెల్యే రాహుల్ ఓ మహిళను బెదిరించాడు. ఆమె గర్భం దాల్చగా.. అబార్షన్ చేయించుకోమంటూ వేధించాడు. ఆమె అందుకు ఒప్పుకోకపోవడంతో చంపేస్తానని […]

రాహుల్ కు, కాంగ్రెస్ లు బిహార్ లో గౌరవం లేదు- ప్రశాంత్ కిషోర్

ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త, జన్ సూరజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. బిహార్‌ రాష్ట్రంలో రాహుల్ గాంధీకి కానీ, ఆయన పార్టీకి కానీ ఎలాంటి గౌరవం లేదని ఆయన అన్నారు. ఈ వ్యాఖ్యల ద్వారా కాంగ్రెస్ పార్టీ బిహార్ రాజకీయాల్లో తన ప్రాముఖ్యతను కోల్పోయిందని సూచించారు. అంతేకాకుండా, కాంగ్రెస్ పార్టీ రాష్ట్రీయ జనతా దళ్ పార్టీని అనుసరిస్తోందని, స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోవడం లేదని కూడా […]

చంద్రబాబుకు ఏం చేయాలో తెలుసు- సుదర్శన్

దేశంలోని అత్యున్నత నాయకులలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒకరని ప్రతిపక్ష ఉపరాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డి ప్రశంసించారు. ఆయన చంద్రబాబు నాయుడు సామర్థ్యంపై నమ్మకం వ్యక్తం చేస్తూ, “చంద్రబాబుకు ఏం చేయాలో తెలుసు” అని పేర్కొన్నారు. జస్టిస్ సుదర్శన్ రెడ్డి తన వ్యాఖ్యలలో జాతీయ ప్రయోజనాల గురించి కూడా ప్రస్తావించారు. దేశ ప్రయోజనాల దృష్ట్యా ప్రస్తుత ఎన్నికలలో చంద్రబాబు నాయుడు సరైన నిర్ణయం తీసుకుంటారని తాను ఆశిస్తున్నానని తెలిపారు. ఈ వ్యాఖ్యలు చంద్రబాబు జాతీయ […]

ఓట్ చోరీ పై ప్రజల్లోకి కాంగ్రెస్

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ‘ఓట్ చోరీ’ అంశంపై ప్రజల్లో విస్తృత ప్రచారం నిర్వహించాలని నిర్ణయించింది. రాహుల్ గాంధీకి మద్దతుగా ఈ ప్రచారం చేపడుతున్నట్లు టీపీసీసీ (తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ) తెలిపింది. ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ ఈ అంశాన్ని ప్రజల దృష్టికి తీసుకెళ్లేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమైంది. పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) సమావేశంలో ‘ఓట్ చోరీ’ ప్రచార లోగోను ఆవిష్కరించారు. ఈ లోగో ద్వారా ఈ ప్రచారానికి బలం […]

ప్రతీ ఒక్కరూ బాధ్యతగా ఉండాలి: సీఎం చంద్రబాబు నాయుడు

పార్లమెంట్ కమిటీల కూర్పుపై సీఎం చంద్రబాబు నాయుడు సమావేశం నిర్వహించారు. సీఎం క్యాంప్ కార్యాలయంలో జరిగిన సమావేశానికి 75 మంది పార్టీ నేతలు హాజరయ్యారు. పార్లమెంట్ పార్టీ కమిటీల ఏర్పాటు కోసం ఏర్పాటు చేసిన త్రి సభ్య కమిటీలతో చంద్రబాబు భేటీ అయ్యారు. మొత్తం 34 మంది సభ్యులతో పార్లమెంట్ కమిటీలు ఏర్పాటుకానున్నట్లు తెలిపారు. అధ్యక్షునితో పాటు ఏడుగురు చొప్పున ఉపాధ్యక్షులు, అధికార ప్రతినిధులు, కార్య నిర్వాహక కార్యదర్శులు, కార్యదర్శులతో పార్లమెంట్ కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.

కాంగ్రెస్ ఎమ్మెల్యే కె.సి. వీరేంద్ర అరెస్టు

కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే కె.సి. వీరేంద్రను శనివారం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇ.డి.) అరెస్టు చేసింది. మనీలాండరింగ్ కేసులో ఎమ్మెల్యే వీరేంద్రను అరెస్టు చేశారు. శుక్రవారం, వీరేంద్రకు చెందిన అనేక ప్రదేశాలపై ఏకకాలంలో ఈడీ దాడులు చేసింది. ఈ సందర్భంగా 12 కోట్లకు పైగా నగదు, బంగారం, వెండి స్వాధీనం చేసుకున్నారు. ఒక పెద్ద ఆపరేషన్‌లో అక్రమ బెట్టింగ్, ఆన్‌లైన్ గేమింగ్ రాకెట్‌ను ఛేదించింది. ఈ కేసు కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లా ఎమ్మెల్యే కెసి వీరేంద్ర, అతని సన్నిహితులకు […]

ఆ ముగ్గురు MLAలను సస్పెండ్ చేయండి- వైసీపీ డిమాండ్

శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి అటవీ అధికారులపై దాడికి పాల్పడ్డారని, దీనిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేయాలని డిమాండ్ చేసింది. గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ తన సొంత పార్టీ కార్యకర్తను వేధించారని, అలాగే ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ ఒక మహిళా ప్రిన్సిపల్‌ను వేధించారని వైసిపి తీవ్ర ఆరోపణలు చేసింది. ఈ ముగ్గురు అధికార పార్టీ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ […]

రౌడీషీటర్ శ్రీకాంత్ పెరోల్‌కు లేఖ ఇచ్చా: ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి

శ్రీకాంత్‌కి పెరోల్ ఇవ్వాలని ఆయన తండ్రి తన దగ్గరకి వస్తే సిఫార్సు లేఖ ఇచ్చినట్లు మీడియాకు తెలిపారు. వివిధ సమస్యలతో వచ్చే వారికి ఎమ్మెల్యేలు లేఖలు ఇస్తారు. అధికారులు వాటిని పరిశీలించి సమాధానం చెబుతారు. అందులో భాగంగానే తాను పెరోల్ సిఫారసు లేఖ ఇచ్చినట్లు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పేర్కొన్నారు. తాను, గూడూరు ఎమ్మెల్యే పాశం సునీల్ ఇచ్చిన లేఖలను తిరస్కరణకు గురైనట్లు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలిపారు.

మోదీపై పోస్ట్ తో తేజస్వి యాదవ్‌పై కేసు నమోదు

తేజస్వి యాదవ్ తన సోషల్ మీడియా ఖాతాలో ఒక కార్టూన్‌ను పంచుకున్నారు. అందులో మోదీని ఒక దుకాణదారుడిగా చూపించి, ఆ దుకాణానికి “ప్రసిద్ధ్ జూమ్లే కీ దుకాణ్” (ప్రసిద్ధ హామీల దుకాణం) అని పేరు పెట్టారు. “ఈరోజు గయలో అబద్ధాల దుకాణం తెరుస్తున్నారు. మీ 11 ఏళ్ల పాలన, ఎన్డీఏ 20 ఏళ్ల పాలనపై లెక్క చెప్పండి” అని కఠిన విమర్శలు చేశారు. ప్రధాని ని ఉద్దేశించి అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని ఆరోపణలతో మహారాష్ట్రలోని గడ్చిరోలి పోలీసులు […]

దేశంలోనే అత్యంత ధనిక సీఎంగా చంద్రబాబు

భారతదేశంలోని ముఖ్యమంత్రుల ఆర్థిక స్థితిపై ADR నివేదిక ప్రకారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దేశంలోనే అత్యంత ధనిక ముఖ్యమంత్రిగా నిలిచారు.ఆస్తుల విలువ రూ. 931 కోట్లు అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పెమా ఖండూ రూ.332 కోట్ల ఆస్తులతో రెండో స్థానంలో నిలిచారు. ఇకపోతే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రూ.30 కోట్ల ఆస్తులతో ఏడో స్థానంలో నిలవగా… పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ దేశంలోనే అతితక్కువ ఆస్తులు కలిగిన సీఎంగా నిలిచారు. మమతాబెనర్జీ ఆస్తులు కేవలం […]

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON