తేజస్వి యాదవ్ తన సోషల్ మీడియా ఖాతాలో ఒక కార్టూన్‌ను పంచుకున్నారు. అందులో మోదీని ఒక దుకాణదారుడిగా చూపించి, ఆ దుకాణానికి “ప్రసిద్ధ్ జూమ్లే కీ దుకాణ్” (ప్రసిద్ధ హామీల దుకాణం) అని పేరు పెట్టారు. “ఈరోజు గయలో అబద్ధాల దుకాణం తెరుస్తున్నారు. మీ 11 ఏళ్ల పాలన, ఎన్డీఏ 20 ఏళ్ల పాలనపై లెక్క చెప్పండి” అని కఠిన విమర్శలు చేశారు. ప్రధాని ని ఉద్దేశించి అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని ఆరోపణలతో మహారాష్ట్రలోని గడ్చిరోలి పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు.

