కేరళ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే దారుణాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే ఓ సినిమా నటి.. తనను వేధించాడని ఆరోపణలు చేయగా నటిని వేదించింది ఎమ్మెల్యే రాహుల్ మామ్కూటథిల్ అంటూ పెద్ద ఎత్తున ధర్నాలు, రాస్తారోకోలు చేయగా ఆయన అన్ని పార్టీ పదవుల నుంచి రాజీనామా చేశారు. మరో ఆడియో క్లిప్ లో ఎమ్మెల్యే రాహుల్ ఓ మహిళను బెదిరించాడు. ఆమె గర్భం దాల్చగా.. అబార్షన్ చేయించుకోమంటూ వేధించాడు. ఆమె అందుకు ఒప్పుకోకపోవడంతో చంపేస్తానని కూడా బెదిరింపులకు పాల్పడ్డాడు

