loader

చొరబాటుదార్ల కోసం సర్‌పై సణుగుడు: ప్రధాని మోడీ

చొరబాటుదార్లకు కొమ్ముకాయడం, రాజకీయ లబ్థికి దిగడం తృణమూల్ కాంగ్రెస్ నిజరూపం అని ప్రధాని నరేంద్ర మోడీ కోల్‌కతాలోని బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్‌లో జరిగిన బహిరంగ సభలో విమర్శించారు. అక్రమ వలసదార్లు ఓటుబ్యాంక్‌లు కావడంతోనే ఇప్పుడు టిఎంసి ఓటర్ల జాబితాల సవరణ ప్రక్రియ సర్‌ను అడ్డుకునేందుకు యత్నిస్తోందని ప్రధాని చెప్పారు. టిఎంసి హయాంలో సరిహద్దులు దాటి వచ్చిన వారి సంఖ్య ఎక్కువ అయింది. దీనితో రాష్ట్రంలోని పలు ప్రాంతాలలో జనాభాపరంగా చాలా అసమతూకత ఏర్పడింది.

నాయకుడు ఉద్భవిస్తున్నాడు.. నారా లోకేష్‌పై నాగబాబు ప్రశంసలు

ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ మీద.. జనసేన ఎమ్మెల్సీ నాగబాబు ప్రశంసలు కురిపించారు. తెలుగుదేశం పార్టీ నుంచి నాయకుడు ఉద్భవిస్తున్నాడంటూ నాగబాబు నారా లోకేష్ మీద ప్రశంసల జల్లు కురిపించారు. సోషల్ మీడియా వేదికగా నాగబాబు చేసిన ఈ ట్వీట్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. మధ్యాహ్న భోజనంలో పొరపాటు జరిగితే, అది పాఠశాల తప్పు అయినప్పటికీ మంత్రి లోకేష్ బాధ్యత తీసుకున్నారని ప్రశంసించారు.

జనసేన 13వ ఆవిర్భావ దినోత్సవం.. సీఎం చంద్రబాబు శుభాకాంక్షలు

జనసేన పార్టీ 13వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి, ఆ పార్టీ అధినేత, పవన్ కళ్యాణ్‌కు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట్ర అభివృద్ధిలో, తెలుగు ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంలో జనసేన పోషిస్తున్న పాత్ర అభినందనీయం. ప్రజలకు అండగా నిలుస్తూ వారి భవిష్యత్ కోసం పనిచేస్తున్న జనసైనికులకు, వీరమహిళలకు, నేతలకు శుభాభినందనలు.

NDA కూటమితో పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదు: విజయ్ పార్టీ క్లారిటీ

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నగారా మోగకముందే రాజకీయ వేడి రాజుకుంది. ముఖ్యంగా దళపతి విజయ్ నేతృత్వంలోని తమిగళ వెట్రి కజగంపైనే అందిరి దృష్టి నెలకొంది. ఎన్డీఏతో పొత్తు ఉంటుందని వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో విజయ్ పార్టీ క్లారిటీ ఇచ్చింది. ఎన్డీఏ కూటమితో పొత్తుకు ఎటువంటి ఆస్కారం లేదని స్పష్టం చేసింది. ఈ విషయమై జరుగుతున్న చర్చలను కేవలం ఊహాగానాలుగా మాత్రమే అని కొట్టిపారేసింది.

కాంగ్రెస్​ది బాధ్యతారాహిత్యం- ప్రజల్లో భయాందోళనలు సృష్టించేందుకు ప్రయత్నిస్తోంది: మోదీ

ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న యుద్ధాల వల్ల తలెత్తే ప్రభావాలు దేశ ప్రజలపై పడకుండా కేంద్ర ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ శనివారం అన్నారు. అయితే ప్రతిపక్ష కాంగ్రెస్ మాత్రం దేశంలో భయాందోళనలు సృష్టించేందుకు ప్రయత్నిస్తూ, చాలా బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. అసోంలోని సిల్చార్​లో జరిగిన భారీ బహిరంగ సభలో ప్రసంగించిన మోదీ, కాంగ్రెస్​ ఈశాన్య రాష్ట్రాలను తీవ్రంగా నిర్లక్ష్యం చేసిందని మండిపడ్డారు.

సీఎం రేవంత్ రెడ్డి తన బినామీ కంపెనీ కోసం అధికారులపై ఒత్తిడి తెచ్చారు…: అమిత్ షాకు కేటీఆర్ లేఖ

తెలంగాణలో శాంతి భద్రతలు దిగజారాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బినామీ సంస్థగా చెబుతున్న కేఎల్‌ఎస్‌ఆర్ ఇన్‌ఫ్రాటెక్ ప్రైవేట్ లిమిటెడ్‌కు ప్రభుత్వ కాంట్రాక్టులను సక్రమంగా కేటాయించలేదని ఆరోపణలు ఉన్నాయని చెప్పారు. ఈ మేరకు కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు కేటీఆర్ లేఖ రాశారు. రాష్ట్రంలోని విచారణ సంస్థలను, పోలీసు అధికారులను నమ్మే పరిస్థితి లేదని అన్నారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా క్షీణించిందని, పోలీస్ వ్యవస్థపైన ప్రజలకు నమ్మకం […]

MIM ఇఫ్తార్ విందు ఫ్లెక్సీలను చించివేసిన మాధవీలత

బంజారాహిల్స్‌లోని విరించి ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. MIM నాయకులు ఏర్పాటు చేసిన సామూహిక ఇఫ్తార్ విందు ఫ్లెక్సీలను బీజేపీ నాయకురాలు మాధవీలత స్వయంగా చించివేశారు. కోట్లు ఖర్చు చేస్తూ ధనవంతులు, పెద్ద నాయకుల కోసం ఫంక్షన్ హాళ్లు, ఏసీ గదుల్లో విందులు ఏర్పాటు చేయడం రంజాన్ స్ఫూర్తికి విరుద్ధమని మాధవీలత ఆరోపించారు. నిజమైన ఇఫ్తార్ విందు అంటే కేవలం ధనవంతులకు ఇచ్చేది కాదని, పేదలకు,  అనాథ ఆశ్రమాల్లో ఉన్న అభాగ్యులకు అండగా నిలబడాలని మాధవీలత హితవు […]

తమిళనాడులో వీకే శశికళ కొత్త పార్టీ ప్రారంభం

కొంతకాలంగా ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటున్న వీకే శశికళ, తన నూతన పార్టీకి ‘ఆలిండియా పురుచ్చి తలైవార్‌ మక్కల్‌ మునేత్ర కళగం’ (AIPTMMK) అని పేరు పెట్టారు. ఏఐఏడీఎంకే (AIADMK) వ్యవస్థాపకులు, దివంగత ఎంజీ రామచంద్రన్ (MGR)ను ‘పురుచ్చి తలైవార్’ అని పిలుచుకుంటారు. పార్టీ గుర్తుగా ‘కొబ్బరి చెట్టు’ ను శశికళ ప్రకటించారు. కొబ్బరి చెట్టు ఐక్యతకు చిహ్నమని, ఇప్పటికే ఆవిష్కరించిన పార్టీ జెండాలో నలుపు, తెలుపు, ఎరుపు రంగులతో పాటు అన్నాదురై, ఎంజీఆర్, మరియు జయలలిత […]

ఫరూఖ్‌ అబ్దుల్లాను 20 ఏళ్లుగా చంపాలనుకుంటున్నా’.. దర్యాప్తులో దుండగుడి వెల్లడి

జమ్ముకశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్‌ కాన్ఫరెన్స్‌ పార్టీ అధ్యక్షుడు ఫరూఖ్‌ అబ్దుల్లా పై బుధవారం హత్యాయత్నం జరిగింది. ఆయన ఓ పెళ్లి వేడుకలో పాల్గొని, వేదిక నుంచి తిరిగి వస్తుండగా ఓ దుండుగుడు ఆయనపై పాయింట్‌ బ్లాంక్‌ రేంజ్‌ నుంచి కాల్పులు జరిపేందుకు ప్రయత్నించాడు. కానీ వెంటనే సెక్యూరిటీ సిబ్బంది అప్రమత్తమై పక్కకు లాగడంతో బుల్లెట్‌ గురితప్పింది. తాను 20 ఏళ్లుగా ఫరూఖ్‌ అబ్దుల్లాను హత్య చేయాలనుకుంటున్నానని పోలీసుల దర్యాప్తులో దుండగుడు వెల్లడించడం గమనార్హం.

బిఆర్ఎస్ కు షాక్.. పార్టీ ఫిరాయింపుల కేసును డిస్పోజ్ చేసిన సుప్రీం

పార్టీ ఫిరాయింపుల కేసులో బిఆర్ఎస్ పార్టీకి నిరాశే మిగిలింది. పార్టీ ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేలపై సుప్రీంకోర్టు వేటు వేస్తుందని భావించిన బిఆర్ఎస్ కు షాక్ తగిలింది. స్పీకర్ తీర్పుతో ఈ కేసులో విచారణను ముగిస్తున్నట్లు ధర్మాసనం వెల్లడించింది.గురువారం విచారణ సందర్భంగా బిఆర్ఎస్ పిటిషన్లను పరిష్కరించినట్లు స్పీకర్ న్యాయవాది సింఘ్వీ సుప్రీంకోర్టుకు తెలిపారు. దీంతో సింఘ్వీ వాదనతో ఏకీభవించిన జస్టిస్ సంజయ్ కరోల్ ధర్మాసనం.. పార్టీ ఫిరాయింపుల కేసులో విచారణ ముసినట్లు ప్రకటించింది.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON