తెలంగాణలో శాంతి భద్రతలు దిగజారాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బినామీ సంస్థగా చెబుతున్న కేఎల్ఎస్ఆర్ ఇన్ఫ్రాటెక్ ప్రైవేట్ లిమిటెడ్‌కు ప్రభుత్వ కాంట్రాక్టులను సక్రమంగా కేటాయించలేదని ఆరోపణలు ఉన్నాయని చెప్పారు. ఈ మేరకు కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు కేటీఆర్ లేఖ రాశారు. రాష్ట్రంలోని విచారణ సంస్థలను, పోలీసు అధికారులను నమ్మే పరిస్థితి లేదని అన్నారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా క్షీణించిందని, పోలీస్ వ్యవస్థపైన ప్రజలకు నమ్మకం పోయిందని అన్నారు.

