పార్టీ ఫిరాయింపుల కేసులో బిఆర్ఎస్ పార్టీకి నిరాశే మిగిలింది. పార్టీ ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేలపై సుప్రీంకోర్టు వేటు వేస్తుందని భావించిన బిఆర్ఎస్ కు షాక్ తగిలింది. స్పీకర్ తీర్పుతో ఈ కేసులో విచారణను ముగిస్తున్నట్లు ధర్మాసనం వెల్లడించింది.గురువారం విచారణ సందర్భంగా బిఆర్ఎస్ పిటిషన్లను పరిష్కరించినట్లు స్పీకర్ న్యాయవాది సింఘ్వీ సుప్రీంకోర్టుకు తెలిపారు. దీంతో సింఘ్వీ వాదనతో ఏకీభవించిన జస్టిస్ సంజయ్ కరోల్ ధర్మాసనం.. పార్టీ ఫిరాయింపుల కేసులో విచారణ ముసినట్లు ప్రకటించింది.

