జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ అధ్యక్షుడు ఫరూఖ్ అబ్దుల్లా పై బుధవారం హత్యాయత్నం జరిగింది. ఆయన ఓ పెళ్లి వేడుకలో పాల్గొని, వేదిక నుంచి తిరిగి వస్తుండగా ఓ దుండుగుడు ఆయనపై పాయింట్ బ్లాంక్ రేంజ్ నుంచి కాల్పులు జరిపేందుకు ప్రయత్నించాడు. కానీ వెంటనే సెక్యూరిటీ సిబ్బంది అప్రమత్తమై పక్కకు లాగడంతో బుల్లెట్ గురితప్పింది. తాను 20 ఏళ్లుగా ఫరూఖ్ అబ్దుల్లాను హత్య చేయాలనుకుంటున్నానని పోలీసుల దర్యాప్తులో దుండగుడు వెల్లడించడం గమనార్హం.

