బంజారాహిల్స్‌లోని విరించి ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. MIM నాయకులు ఏర్పాటు చేసిన సామూహిక ఇఫ్తార్ విందు ఫ్లెక్సీలను బీజేపీ నాయకురాలు మాధవీలత స్వయంగా చించివేశారు. కోట్లు ఖర్చు చేస్తూ ధనవంతులు, పెద్ద నాయకుల కోసం ఫంక్షన్ హాళ్లు, ఏసీ గదుల్లో విందులు ఏర్పాటు చేయడం రంజాన్ స్ఫూర్తికి విరుద్ధమని మాధవీలత ఆరోపించారు. నిజమైన ఇఫ్తార్ విందు అంటే కేవలం ధనవంతులకు ఇచ్చేది కాదని, పేదలకు, అనాథ ఆశ్రమాల్లో ఉన్న అభాగ్యులకు అండగా నిలబడాలని మాధవీలత హితవు పలికారు.

