loader

మొదటిసారిగా ‘బి.టెక్ ఎల్.ఎల్.బి (ఆనర్స్)’ కోర్సు ప్రారంభం!

హైదరాబాద్‌లోని ప్రముఖ విద్యాసంస్థ మహీంద్రా విశ్వవిద్యాలయం, భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని బి.టెక్ ఎల్.ఎల్.బి. (ఆనర్స్) అనే ఒక వినూత్నమైన ఇంటిగ్రేటెడ్ కోర్సును ప్రారంభించింది. నేటి మారుతున్న ప్రపంచంలో కేవలం న్యాయశాస్త్ర పరిజ్ఞానం మాత్రమే సరిపోదని, సాంకేతిక అంశాలపై కూడా పట్టు ఉండాలని భావించి ఈ ప్రోగ్రామ్‌ను రూపొందించారు. ఆసక్తి గల విద్యార్థులు విశ్వవిద్యాలయ అధికారిక వెబ్‌సైట్ https://admission.mahindrauniversity.edu.in సందర్శించి పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు మరియు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఇది ప్రజాస్వామ్య విజయం

రాజ్యాంగ సవరణ బిల్లు (131వ సవరణ) లోక్ సభలో వీగిపోయింది. దీనిపై కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా ఘాటుగా స్పందించారు. “ఇది ప్రజాస్వామ్యానికి దక్కిన భారీ విజయం” అని ఆమె అభివర్ణించారు. మహిళా రిజర్వేషన్ల పేరుతో నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) చేపట్టి, దేశ రాజకీయ మ్యాప్ను మార్చాలని చూసిన ప్రభుత్వ కుట్రను విపక్షాలు ఐక్యంగా అడ్డుకున్నాయని ఆమె పేర్కొన్నారు. గతంలో ఎన్నడూ మహిళల కోసం నిలబడని వారే ఇప్పుడు విపక్షాలను ‘మహిళా వ్యతిరేకులు’ అని పిలవడం […]

వైసీపీ నేత శ్రీహరికి షాక్.. రిమాండ్‌కు హైకోర్టు గ్రీన్ సిగ్నల్!

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సోషల్ మీడియా వివాదం మరింత వేడెక్కింది. ముఖ్యమంత్రి చంద్రబాబుపై అభ్యంతరకర పోస్టులు పెట్టారనే ఆరోపణలతో అరెస్టయిన వైసీపీ సోషల్ మీడియా జనరల్ సెక్రటరీ పూడి శ్రీహరి, జి. గిరీశ్ కుమార్ రెడ్డిలకు ఏపీ హైకోర్టు షాక్ ఇచ్చింది. ఈ కేసులో నిన్న కుప్పం కోర్టు రిమాండ్‌కు పంపేందుకు నిరాకరించింది. అయితే తాజాగా ఆ తీర్పును ఏపీ హైకోర్టు నిలిపివేసింది. వారిని రిమాండ్‌కు తరలించేందుకు కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

రాజ్యాంగ విరుద్ధ ఎత్తుగడను ‘ఇండియా’ ఆపింది: రాహుల్‌

131వ రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోడంపై లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ స్పందించారు. వారు మహిళల పేరుతో రాజ్యాంగ విరుద్ధమైన ఎత్తుగడ వేసి.. రాజ్యాంగాన్ని ఉల్లంఘించడానికి ప్రయత్నించారని విమర్శించారు. అందుకే ఈ బిల్లును ‘ఇండియా’ గుర్తించి ఆపిందని పేర్కొన్నారు. రాజ్యాంగానికి వందనం అని చెబుతూ.. ఈమేరకు ‘ఎక్స్‌’ వేదికగా పోస్టు చేశారు.

ట్రావెల్స్‌ బస్సును ఢీకొట్టిన కారు.. చెలరేగిన మంటలు, 9 మంది మృతి

కర్ణాటకలోని యాద్గిర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. శుక్రవారం మధ్యాహ్నం సురపూర్ తాలూకాలోని శాంతాపూర్ క్రాస్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఒక కుటుంబం ప్రయాణిస్తున్న కారు టైర్‌ పేలిపోయింది. అదుపుతప్పిన ఆ కారు ఎదురుగా వస్తున్న ప్రైవేట్‌ ట్రావెల్‌ బస్సును ఢీకొట్టింది. ఆ వెంటనే మంటలు చెలరేగాయి. కారు, ట్రావెల్స్ బస్సు పూర్తిగా దగ్ధమయ్యాయి. కారులో ప్రయాణించిన ఒకే కుటుంబానికి చెందిన 9 మంది మరణించారు. మృతుల్లో నలుగురు పిల్లలున్నారు.

వీగిపోయిన 131వ రాజ్యాంగ సవరణ బిల్లు

మహిళా రిజర్వేషన్ల చట్టం అమలుకు తీసుకొచ్చిన రాజ్యాంగ సవరణ బిల్లు లోక్‌సభలో వీగిపోయింది. 131వ రాజ్యాంగ సవరణ బిల్లు-2026కు మూడింట రెండొంతుల మెజారిటీ కావాల్సి ఉంది. కానీ ఈ బిల్లుకు కావాల్సినంత మంది సభ్యుల మద్దతు రాలేదు. బిల్లుకు అనుకూలంగా 298 ఓట్లు, వ్యతిరేకంగా 230 ఓట్లు వచ్చాయి. ఓటింగ్‌కు 528 మంది సభ్యులు హాజరు కాగా.. బిల్లు ఆమోదానికి 326 ఓట్లు కావాల్సి ఉంది. ఈ మద్దతును ఎన్డీయే కూడగట్టలేకపోయింది.

‘హార్ముజ్’ గేట్లు ఓపెన్.. కనికరించిన ఇరాన్ – ఇక లైన్ క్లియర్..!!

ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ వెల్లడించిన ప్రకారం.. అన్ని వాణిజ్య నౌకల రాకపోకలకు అనుమతి ఇస్తూ హర్మూజ్ జలసంధిని తిరిగి పూర్తిస్థాయిలో అందుబాటులోకి తెచ్చినట్టు స్పష్టం చేశారు. లెబనాన్‌లో పరిస్థితులు శాంతించడంతో పాటు.. కాల్పుల విరమణ ఒప్పందం అమల్లో ఉన్నంత వరకు ఈ నిర్ణయం కొనసాగుతుందని వెల్లడించారు. ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియా వేదికగా కూడా ప్రకటించారు.

రాహుల్ కు బిగ్ షాక్ ఇచ్చిన లక్నో హైకోర్టు

కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీకి లక్నో హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆయనపై ఉన్న ద్వంద్వ పౌరసత్వం ఆరోపణలకు సంబంధించి తక్షణమే FIR నమోదు చేయాలని కోర్టు ఉన్నత స్థాయి అధికారులను ఆదేశించింది. 2024లో కర్ణాటకకు చెందిన బీజేపీ కార్యకర్త విఘ్నేశ్ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టిన ధర్మాసనం, ఈ వివాదంలో ప్రాథమిక విచారణ అవసరమని భావించింది. రాహుల్ గాంధీకి బ్రిటీష్ పౌరసత్వం కూడా ఉందనేది పిటిషనర్ ప్రధాన ఆరోపణ.

టీ20 ప్రపంచకప్‌లో ఫిక్సింగ్ కలకలం..

2026 టీ20 ప్రపంచకప్‌లో భాగంగా న్యూజిలాండ్ వర్సెస్ కెనడా మధ్య జరిగిన మ్యాచ్‌లో ఫిక్సింగ్ ఆరోపణలు వెల్లువెత్తాయి.కెప్టెన్ దిల్‌ప్రీత్ బజ్వా వేసిన ఐదో ఓవర్ ఇప్పుడు ప్రధాన చర్చనీయాంశమైంది. ఒక అంతర్జాతీయ స్థాయి బౌలర్ వరుసగా నోబాల్స్, వైడ్లు వేయడం సాధారణం కాదని విశ్లేషకులు భావిస్తున్నారు. ఆ ఒక్క ఓవర్‌లోనే బజ్వా ఏకంగా 15 పరుగులు సమర్పించుకోవడం వెనుక బుకీల హస్తం ఉందన్న అనుమానాలు బలపడుతున్నాయి. మైదానంలో ఆటగాడి ప్రవర్తన చూస్తుంటే అది సహజంగా జరిగిన పొరపాటులా […]

ఐటీ రంగంలో “ఏఐ” ప్రకంపనలు! క్యాంపస్ హైరింగ్‌కు కంపెనీలు బ్రేక్‌!

కాలేజీ చివరి సంవత్సరంలో ఉండగానే వేలాది మందిని బల్క్‌గా కంపెనీలు తీసుకెళ్లి ట్రైనింగ్ ఇచ్చి ఉద్యోగాల్లో చేర్చుకునేవి. కానీ ఇప్పుడు ఆ మాస్‌ హైరింగ్‌ శకం ముగిసిందని విప్రో తీసుకున్న నిర్ణయం స్పష్టం చేస్తోంది. ప్రో చీఫ్ హ్యూమన్ ఆఫిసర్ సౌరభ్ గోవిల్ మాట్లాడుతూ… ప్రస్తుతం మార్కెట్ పరిస్థితులు చాలా అస్థిరంగా ఉన్నాయి. మునుపటిలా రెవెన్యూ పెరగాలంటే వేలాది మంది కొత్త ఉద్యోగులు అవసరం లేదు. ఏఐ సాయంతో తక్కువ మందితోనే ఎక్కువ పనిని పూర్తి చేయవచ్చని […]

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON