loader

రాముణ్ణి వెక్కరించలేదు…ఇది మతోన్మాద రాజకీయ నాయకులు ఏడుపు- ప్రకాష్ రాజ్

శ్రీరామచంద్రుని మీద చేసిన వ్యాఖ్యలపై ప్రకాష్ రాజ్ ఓ వీడియో విడుదల చేశారు. తన మాటల్ని వక్రీకరించారని చెప్పిన ప్రకాష్ రాజ్… అన్ని ధర్మాలను, అందరినీ ప్రేమించే తనకు రాముడిని వెటకారం చేసే అవసరం అయితే లేదని తెలిపారు. ఇంకా ఆయన మాట్లాడుతూ… ”ధర్మాన్ని మతోన్మాదంతో అడ్డు పెట్టుకుని అసహ్యమైన రాజకీయం చేస్తున్న వాళ్ళను నేను అడిగే ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేక కొందరు నన్ను యాంటీ హిందూ, హిందూ ధర్మ విరోధి అని నిందించడానికి ప్రయత్నిస్తున్నారు. సో… […]

పవన్ కళ్యాణ్‌ను ఫోన్లో పరామర్శించిన ప్రధాని మోదీ..

భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆరోగ్యంపై స్పందించారు. పవన్ కళ్యాణ్ సర్జరీ అనంతరం కోలుకుంటున్న క్రమంలో ప్రధాని మోదీ ఆయనతో స్వయంగా మాట్లాడి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు, మంత్రి నారా లోకేష్  శస్త్రచికిత్స అనంతరం కోలుకుంటున్న పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆరోగ్య పరిస్థితిపై స్పందించారు. సర్జరీ చేయించుకున్న పవన్ కళ్యాణ్ […]

అమెరికాలో టోర్నడో బీభత్సం.. ఎగిరిపోయిన ఇళ్ల పైకప్పులు

అమెరికాలోని ఉత్తర ఇల్లినాయిస్ రాష్ట్రాన్ని టోర్నడో వణికించింది. లీనా పట్టణంలో సంభవించిన ఈ సుడిగాలి ధాటికి ఇళ్లు, పాఠశాలలు ధ్వంసమయ్యాయి. విద్యుత్ లైన్లు తెగిపడి పట్టణం చీకటిమయమైంది. విస్కాన్సిన్, మిన్నెసోటా రాష్ట్రాల్లో కూడా దీని ప్రభావం తీవ్రంగా ఉంది.

అక్షయ తృతీయ

మత్స్య పురాణం అరవై ఐదవ అధ్యాయం ప్రకారం.. ఈశ్వరుడు పార్వతీదేవికి సర్వకామ ప్రథమైన అక్షయ తృతీయ వ్రతం గూర్చి చెప్పాడు. వైశాఖ శుద్ధ తదియ నాడు చేసే ఏ వ్రతమైనా, జపమైనా, హోమమైనా, దానాదులేవైనా లేక పుణ్య కార్యాచరణమేదైనా దాని ఫలితము అక్షయమౌతుంది. అలాగే పుణ్య కార్యాచరణ వల్ల వచ్చే ఫలితం అక్షయమైనట్లే, పాపకార్యాచరణ వల్ల వచ్చే పాపం కూడా అక్షయమే అవుతుంది .

తెలంగాణలో పలువురు ఐపీఎస్ ల బదిలీ

తెలంగాణలో పలువురు ఐపీఎస్ లను ప్రభుత్వం బదిలీ చేసింది. ఆసిఫాబాద్ అడిషనల్ ఎస్పీ (అడ్మిన్) గా చిత్తరంజన్ ను నియమించారు. సంగారెడ్డి అడిషనల్ ఎస్పీగా చైతన్య రెడ్డి, జగిత్యాల అడిషనల్ ఎస్పీ (అడ్మిన్)గా పండరీ చేతన్, మెదక్ జిల్లా అదనపు ఎస్పీ(అడ్మిన్) గా విక్రాంత్ కుమార్ సింగ్, నిజామాబాద్ అదనపు డీసీపీ (అడ్మిన్)గా శుభం ప్రకాశ్, వనపర్తి అడిషనల్ ఎస్పీ (అడ్మిన్)గా రాజేశ్ మీనా, ఆదిలాబాద్ అడిషనల్ ఎస్పీ (అడ్మిన్)గా మౌనిక, నిర్మల్ జిల్లా బైంసా ఏఎస్పీగా […]

ప్రకాశ్ రాజ్ కు లీగల్ నోటీసులు

నటుడు ప్రకాశ్‌రాజ్‌కు లీగల్ నోటీసులు జారీ అయ్యాయి. హిందువుల మనోభావాలను కించపరిచేలా వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో ఆయనకు తాజాగా లీగల్ నోటీసులు జారీ అయ్యాయి. టిటిడి బోర్డు సభ్యుడు భానుప్రకాశ్ రెడ్డి తరఫు న్యాయవాది ఈ నోటీసులను పంపించారు. తమ వ్యాఖ్యలపై ప్రకాశ్ రాజ్ తక్షణమే బహిరంగ క్షమాపణలు చెప్పాలని భాను ప్రకాశ్ రెడ్డి డిమాండ్ చేశారు. ఒకవేళ నిర్ణీత సమయంలోగా స్పందించకపోయినా లేదా క్షమాపణలు చెప్పకపోయినా రూ. 100 కోట్లకు పరువు నష్టం దావా దాఖలు చేస్తామని హెచ్చరించారు.

పవన్ కళ్యాణ్ కి సడెన్ గా శస్త్ర చికిత్స..అభిమానుల్లో ఆందోళన

ఉప ముఖ్యమంత్రి, జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి శనివారం సాయంత్రం శస్త్రచికిత్స జరిగింది. పవన్ అభిమానులకు ఇది ఆందోళన కలిగించే వార్తే అని చెప్పాలి. వారం నుంచి పది రోజులపాటు విశ్రాంతి తర్వాత ఆయన అధికారిక కార్యక్రమాలలో పాల్గొనవచ్చని డాక్టర్లు తెలిపారు. అయితే తర్వాత దీర్ఘకాలం పాటు పవన్ జాగ్రత్తలు తీసుకోవాలి అని వైద్యులు చెప్పడం ఆందోళన కలిగిస్తోంది. పవన్ మునుపటిలా యాక్టివ్ గా రాజకీయాలు, సినిమాలు బ్యాలెన్స్ చేయగలరా అనే చర్చ మొదలైంది.

స్పైస్‌జెట్‌లో భారీ లేఆఫ్స్… 500 మందికి షాక్

ప్రముఖ విమానయాన సంస్థ స్పైస్‌జెట్ ప్రస్తుతం తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. నిధుల కొరత కారణంగా సంస్థ తన సిబ్బందిని తగ్గించే నిర్ణయం తీసుకుంది. ఖర్చులను తగ్గించుకోవడానికి మొదటి దశలో భాగంగా సుమారు 500 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు సమాచారం. సంస్థలో ప్రస్తుతం దాదాపు 6,800 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు.  గతంలో సంస్థ వద్ద సుమారు 50 విమానాలు ఉండగా ప్రస్తుతం కేవలం 13 విమానాలు మాత్రమే ఉన్నాయి.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON