loader

ఎయిర్​పోర్ట్​లో ‘బీజేపీ’ అధికారులు- నా ఫ్లైట్​ జర్నీలను అడ్డుకునే యత్నం!: దీదీ

తాను ప్రయాణించే విమాన కార్యకలాపాల్లో అంతరాయం కలిగించడానికి బీజేపీ ప్రణాళికలు సిద్ధం చేసిందని బంగాల్​ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆరోపించారు. ఇందుకోసం విమానాశ్రయాల్లో తమకు అనుకూలంగా సిబ్బందిని నియమించుకున్నారని విమర్శించారు. అంతేకాదు తన విమానాన్ని రన్​వేపై 30 నిమిషాల పాటు నిలిపి ఉంచారని, ఈ చేదు అనుభవం ఝార్ఖండ్​ ముఖ్యమంత్రి హేమంత్​ సోరెన్​ కూడా ఎదురైందని వ్యాఖ్యానించారు. ఎన్నికల్లో గెలవడానికి ఏఐటీసీ(ఆల్​ ఇండియా తృణమూల్​ కాంగ్రెస్​) కార్యకర్తలపై తప్పడు కేసులు బనాయిస్తున్నారని మమతా ఆరోపించారు. గంజాయి కేసులు […]

నకిలీ మధుమేహం ఇంజెక్షన్లు.. ఇద్దరి అరెస్టు

మధుమేహం తగ్గించేందుకు ఉపయోగించే ‘మౌంజారో'(Mounjaro) నకిలీ ఇంజెక్షన్ల వ్యవహారం గురుగ్రామ్ లో కలకలం రేపింది. చైనా నుంచి ముడిపదార్థాలు తెప్పించి ఈ నకిలీ ఇంజెక్షన్లు తయారుచేస్తున్న ముఠాకి చెందిన ఇద్దరు వ్యక్తులను గురుగ్రామ్లో పోలీసులు అరెస్టు చేశారు. ఈ నకిలీ ఇంజెక్షన్లను ఇండియా మార్ట్ బీ2బీ పోర్టల్ ద్వారా వినియోగదారులకు సప్లై చేస్తున్నారు. ‘మౌంజారో’ అనే ఇంజెక్షన్ను టైప్ 2 డయాబెటిస్ ఉన్న వ్యక్తులు వారానికోసారి తీసుకుంటారు. దీంతో మధుమేహం కంట్రోల్లో ఉండడంతో మార్కెట్లో లో వీటికి […]

రోగికి కుట్లు వేసిన సెక్యూరిటీ గార్డు.. నెటిజన్ల ఆగ్రహం

ఆపరేషన్ థియేటర్‌లో టేబుల్ మీద పడుకున్న వ్యక్తికి సెక్యూరిటీ గార్డు కుట్లు వేస్తున్న ఫొటో, వీడియో సోషల్ మీడియాలో వైరల్‌‌గా మారింది. దీనిపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శిక్షణ పొందిన వైద్యులు, నర్సులు చేయాల్సిన చికిత్స.. ఇలా సెక్యూరిటీ గార్డు చేయడంతో ప్రభుత్వంపై వారు విమర్శలు గుప్పిస్తున్నారు. ఆపరేషన్ థియేటర్‌లోకి ఎవరినైనా పంపిస్తారా? అంటూ వారు ప్రశ్నిస్తున్నారు. ఈ ఘటన బిహార్‌ పశ్చిమ చంపారన్ జిల్లాలో బగాహా పట్టణంలోని సబ్ డివిజనల్ ప్రభుత్వాసుపత్రిలో చోటు చేసుకుంది.

యాపిల్‌ కొత్త CEOగా జాన్‌ టెర్నస్‌..

టెక్‌ రంగంలో సంచలనాత్మక మార్పుగా యాపిల్‌ తన నాయకత్వ నిర్మాణంలో కీలక నిర్ణయం తీసుకుంది. దాదాపు 15 సంవత్సరాలుగా సీఈవోగా కొనసాగుతున్న టిమ్‌ కుక్‌ తన పదవికి వీడ్కోలు పలుకుతుండగా, హార్డ్‌వేర్‌ ఇంజినీరింగ్‌ విభాగం సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌గా ఉన్న జాన్ టెర్నస్ కొత్త సీఈవోగా బాధ్యతలు స్వీకరించనున్నారు. సెప్టెంబర్‌ 1 నుంచి ఈ మార్పు అమల్లోకి రానుంది. ఇక కుక్‌ కంపెనీ ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు.

ఏపీలో మున్సిపల్ కార్మికుల సమ్మె.. ప్రభుత్వానికి ఇబ్బందులు తప్పవా!

ఆంధ్రప్రదేశ్‌లో నేటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్‌ కార్మికులు సమ్మె చేయనున్నట్లు మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ తెలిపింది. మార్చి నెలకు సంబంధించి జీతాలు ఇప్పటి వరకు ఇవ్వలేదని.. కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సకాలంలో జీతాలు చెల్లించకపోవడంతో కుటుంబ పోషణ భారంగా మారిందని.. గత నెల నుంచి పెండింగ్‌లో ఉన్న జీతాలను వెంటనే విడుదల చేయాలని కార్మికులు డిమాండ్ చేశారు. తమ జీతాల అంశంపై ప్రభుత్వం స్పందించే వరకు సమ్మె కొనుగుతుందని […]

జ‌ర్మ‌నీ గురుద్వారలో ఘ‌ర్ష‌ణ‌.. 11 మందికి గాయాలు

జ‌ర్మ‌నీలోని మోయ‌ర్స్ ప‌ట్ట‌ణంలోని దుస్‌బ‌ర్గ్ గురుద్వార‌లో సిక్కులు ఘ‌ర్ష‌ణ ప‌డ్డారు. ఘ‌ర్ష‌ణ‌ల్లో సుమారు 11 మంది తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. గ‌న్నులు, క‌త్తులు, పెప్ప‌ర్ స్ప్రేతో ఒక‌రిపై ఒక‌రు దాడి చేసుకున్నారు. గురుద్వార‌లో చోటుచేసుకున్న ఘ‌ర్ష‌ణ ఘ‌ట‌న‌కు చెందిన వీడియోలు ప్ర‌స్తుతం ఆన్‌లైన్‌లో వైర‌ల్ అవుతున్నాయి. రెండు గ్రూపుల మ‌ధ్య కొట్లాట జ‌రిగింది. ఇటీవ‌ల కొత్త బోర్డు ఎన్నికైంది. అయితే ఆ స‌మావేశంలో రెండు వ‌ర్గాల మ‌ధ్య వివాదం చెల‌రేగిన‌ట్లు తెలుస్తోంది. హుండీ డ‌బ్బు అంశంలో వివాదం చెల‌రేగిన‌ట్లు […]

‘యుద్ధం మొదలైతే అంతుచిక్కని అస్త్రాలతో దాడి చేస్తాం’: ఇరాన్ సంచలన ప్రకటన

పశ్చిమాసియాలో కాల్పుల విరమణ గడువు ముగుస్తున్న వేళ.. అమెరికా, ఇజ్రాయెల్‌కు ఇరాన్ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. ఒకవేళ శాంతి చర్చలు ఫలించక, యుద్ధం మళ్లీ మొదలైతే.. మేము కొత్త వ్యూహాలతో రంగంలోకి దిగుతామని.. యుద్ధ భూమిలోనే శత్రుదేశాలకు వాటి రుచి చూపిస్తామని ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బగేర్ గాలిబాఫ్ హెచ్చరించారు… ప్రపంచవ్యాప్తంగా ఇది చర్చనీయాంశంగా మారింది.గత రెండు వారాలుగా మేము నిశ్శబ్దంగా లేము. యుద్ధ క్షేత్రంలో మా శక్తి సామర్థ్యాలను నిరూపించేలా కొత్త వ్యూహాలను […]

నేషనల్ సివిల్ సర్వీసెస్ డే

ప్రజా సేవ పట్ల అంకితభావం కనబరిచిన సివిల్ సర్వెంట్లను గౌరవించడానికీ, పరిపాలనలో శ్రేష్ఠతను ప్రోత్సహించడానికీ భారతదేశంలో ప్రతి సంవత్సరం ఏప్రిల్ 21న జాతీయ సివిల్ సర్వీసెస్ దినోత్సవాన్ని జరుపుకుంటారు. మొదటి హోం మంత్రి అయిన సర్దార్ వల్లభాయ్ పటేల్ 1947లో చేసిన ప్రసంగంలో సివిల్ సర్వెంట్లను “భారతదేశపు ఉక్కు చట్రం”గా అభివర్ణించారు. ఆ ప్రసంగాన్ని స్మరించుకుంటూ ఈ రోజును జరుపుకుంటారు.

తిలక్ సెంచరీతో కుదేలైన గుజరాత్.. ముంబైకి రెండో విజయం..!

పంతొమ్మిదో సీజన్‌లో ముంబై ఇండియన్స్ రెండో విజయంతో మురిసింది. వరసగా నాలుగు ఓటములనుంచి తేరుకున్న ముంబైకి తిలక్ వర్మ(101 నాటౌట్) సునామీ సెంచరీతో భారీ స్కోరందించగా.. బంతితో అశ్వనీ కుమార్‌(4-24) గుజరాత్ టైటన్స్ మిడిలార్డర్‌ను కూల్చాడు. ఈ సీజన్‌లో తొలి వికెట్‌తో బుమ్రా(1-15) గుజరాత్ పతనాన్ని మొదలెట్టగా కుర్రాడు అశ్వన్ వికెట్ల వేటతో ముంబైని గెలిపించాడు. 200 పరుగుల ఛేదనలో పరిమితమైన గుజరాత్‌కు సొంత ప్రేక్షకుల సమక్షంలో భారీ ఓటమి చవిచూసింది.

వెంకట్రామిరెడ్డిని తొలగించిన ప్రభుత్వం.. మాజీ అధ్యక్షుడు స్పందన ఇదే!

తనను ఉద్యోగం నుండి డిస్మిస్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెంకట్రామిరెడ్డి తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా, కక్షపూరితంగా ఈ చర్య తీసుకుందని ఆయన ఆరోపించారు. 2014-19 మధ్య కాలంలో కూడా పలువురు ప్రభుత్వ ఉద్యోగులు అప్పటి ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేశారని, కానీ వారిపై ఇలాంటి డిస్మిస్ చర్యలు ఎప్పుడూ తీసుకోలేదని వెంకట్రామిరెడ్డి పేర్కొన్నారు. కేవలం ఉద్యోగులు ఎవరూ నోరు మెదపకూడదనే భయం సృష్టించేందుకే ప్రభుత్వం ఈ వేటు వేసిందని విమర్శించారు. ప్రభుత్వం జారీ […]

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON