మధుమేహం తగ్గించేందుకు ఉపయోగించే ‘మౌంజారో'(Mounjaro) నకిలీ ఇంజెక్షన్ల వ్యవహారం గురుగ్రామ్ లో కలకలం రేపింది. చైనా నుంచి ముడిపదార్థాలు తెప్పించి ఈ నకిలీ ఇంజెక్షన్లు తయారుచేస్తున్న ముఠాకి చెందిన ఇద్దరు వ్యక్తులను గురుగ్రామ్‌లో పోలీసులు అరెస్టు చేశారు. ఈ నకిలీ ఇంజెక్షన్లను ఇండియా మార్ట్ బీ2బీ పోర్టల్ ద్వారా వినియోగదారులకు సప్లై చేస్తున్నారు. ‘మౌంజారో’ అనే ఇంజెక్షన్‌ను టైప్ 2 డయాబెటిస్ ఉన్న వ్యక్తులు వారానికోసారి తీసుకుంటారు. దీంతో మధుమేహం కంట్రోల్లో ఉండడంతో మార్కెట్లో లో వీటికి డిమాండ్ ఎక్కువగా ఉందని పోలీసులు పేర్కొన్నారు.

