ఆంధ్రప్రదేశ్లో నేటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ కార్మికులు సమ్మె చేయనున్నట్లు మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ తెలిపింది. మార్చి నెలకు సంబంధించి జీతాలు ఇప్పటి వరకు ఇవ్వలేదని.. కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సకాలంలో జీతాలు చెల్లించకపోవడంతో కుటుంబ పోషణ భారంగా మారిందని.. గత నెల నుంచి పెండింగ్లో ఉన్న జీతాలను వెంటనే విడుదల చేయాలని కార్మికులు డిమాండ్ చేశారు. తమ జీతాల అంశంపై ప్రభుత్వం స్పందించే వరకు సమ్మె కొనుగుతుందని కార్మిక సంఘాల నేతలు తెలిపారు.

