loader

6,6,6,6,4,4,4,4,4.. అభిషేక్ శర్మ విశ్వరూపం 15 బంతుల్లోనే హాఫ్ సెంచరీ

సొంతగడ్డపై హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్లకు  అభిషేక్ శర్మ చుక్కలు చూపించాడు. ఇన్నింగ్స్ ఆరంభం నుంచే ఎడాపెడా బౌండరీలు, భారీ సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. 15 బంతుల్లోనే అద్భుతమైన అర్ధ శతకం సాధించి, ఐపీఎల్ చరిత్రలో అత్యంత వేగవంతమైన హాఫ్ సెంచరీల జాబితాలో చోటు దక్కించుకున్నాడు. స్పిన్నర్లు, పేసర్లు అనే తేడా లేకుండా అందరినీ దారుణంగా శిక్షించాడు. బంతి పడటమే ఆలస్యం   అన్నట్లుగా కళ్లు చెదిరే కట్ షాట్లు, కవర్ డ్రైవ్ లు, […]

ఏపీ మంత్రుల సింగపూర్ పర్యటనకు జీవో జారీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి, సుపరిపాలన లక్ష్యంగా ఏడుగురు మంత్రుల బృందం (కొన్ని నివేదికల ప్రకారం తొమ్మిది మంది) ఈ నెల 21 నుంచి 27 వరకు సింగపూర్‌లో పర్యటించనుంది. ఈ పర్యటనకు సంబంధించి ప్రభుత్వం ఇప్పటికే జీవో జారీ చేసింది. ఈ బృందంలో మంత్రులు కింజరాపు అచ్చెన్నాయుడు, నాదెండ్ల మనోహర్, పొంగూరు నారాయణ, వంగలపూడి అనిత, సత్యకుమార్ యాదవ్, అనగాని సత్యప్రసాద్, బీసీ జనార్ధన్ రెడ్డి ఉన్నారు. రాష్ట్ర ప్రణాళికా విభాగం ఈ పర్యటనకు అయ్యే ఖర్చును […]

హర్మూజ్ జలసంధిలో ఇరాన్ కాల్పులు: వెనక్కి మళ్లిన రెండు భారత నౌకలు

అంతర్జాతీయ వాణిజ్యానికి అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధిలో మరోసారి యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ (IRGC) బలగాలు ఒక ఆయిల్ ట్యాంకర్‌పై కాల్పులు జరపడంతో సముద్ర మార్గంలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఈ పరిణామంతో రెండు భారత జెండా కలిగిన నౌకలు సహా సుమారు 10 వాణిజ్య నౌకలు తమ ప్రయాణాన్ని ఆపేసి వెనక్కి మళ్లాయి. ఈ ఘటన ఒమన్‌కు 20 నాటికల్ మైళ్ల దూరంలో శనివారం చోటుచేసుకున్నట్లు యూకే మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ (యూకేఎంటీవో) ధృవీకరించింది.

యూపీఎస్సీ.. తొలిసారి రాత పరీక్షల ఆన్సర్‌ కీలు విడుదల! సివిల్స్‌లోనూ ఇదే తరహా

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) ఆధ్వర్యంలో నిర్వహించిన నేషనల్ డిఫెన్స్ అకాడమి, కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ (I) 2026కు సంబంధించిన ప్రొవిజనల్ ఆన్సర్ కీలను యూపీఎస్సీ విడుదల చేసింది. గతంలో తుది ఫలితాల విడుదల తర్వాత మాత్రమే ఆన్సర్‌ కీలను యూపీఎస్సీ విడుదల చేసేది. అయితే పారదర్శకత కోసం ఈ ఏడాది నుంచి పరీక్ష జరిగిన కొద్ది రోజుల్లోనే ఆన్సర్‌ కీలను అందుబాటులో ఉంచింది. ప్రాథమిక ఆన్సర్ కీలో ఏవైనా తప్పులు ఉంటే  ఏప్రిల్ […]

ఏపీ లోకల్ పోల్స్ కు లైన్ క్లియర్ – కొత్త ఎస్‌ఈసీగా పునేఠా నియామకం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర కొత్త ఎన్నికల కమిషనర్ (SEC)గా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి అనిల్‌చంద్ర పునేఠా నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలకు గవర్నర్ ఆమోదముద్ర వేయడంతో, ప్రభుత్వం అధికారికంగా నోటిఫికేషన్ విడుదల చేసింది. 2018-19 కాలంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వ హయాంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. రాష్ట్రంలో త్వరలోనే మున్సిపల్, పంచాయతీ ఎన్నికలు జరగాల్సి ఉన్నాయి. ఈ సమయంలో అనిల్‌చంద్ర పునేఠా నియామకం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.

మహిళా రిజర్వేషన్ల బిల్లుపై మాకు చిత్తశుద్ధి ఉంది: రేవంత్

మహిళా బిల్లు వీగిపోవడం బిజెపి విధానాల ఓటమిగా భావిస్తోందని సిఎం రేవంత్ రెడ్డి తెలిపారు. మహిళా బిల్లు పేరుతో డీలిమేషన్ బిల్లు తీసుకు వచ్చిందని అన్నారు. మహిళా రిజర్వేషన్ల బిల్లుపై తమకు చిత్తశుద్ధి ఉందని తెలియజేశారు. మహిళా బిల్లుపై ప్రధాని నరేంద్రమోడీకి నిజాయితీ లేదని విమర్శించారు. నిజాయితీగా మహిళా రిజర్వేషన్ల బిల్లు తీసుకువస్తే మద్దతు ఇచ్చేవారని అన్నారు. మహిళా బిల్లు పేరుతో డీలిమిటేషన్ బిల్లు తీసుకువచ్చి దక్షిణాదికి అన్యాయం చేసేవారని మండిపడ్డారు. కేంద్రానికి ఆర్థిక వనరులు దక్షిణాది […]

మహిళా రిజర్వేషన్ బిల్లు వీగిపోవడం ప్రజాస్వామ్య చరిత్రలో చీకటి రోజు: సీఎం చంద్రబాబు

లోక్‌సభలో మహిళా రిజర్వేషన్ బిల్లు వీగిపోవడం భారత ప్రజాస్వామ్య చరిత్రలో అత్యంత చీకటి రోజని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న మహిళల హక్కులను ప్రతిపక్ష పార్టీలు ఉద్దేశపూర్వకంగా కాలరాశాయని ఆయన మండిపడ్డారు. మహిళా బిల్లు పరాజయానికి నిరసనగా తూర్పు గోదావరి జిల్లా నిడదవోలులో ఎన్డీయే పక్షాలు చేపట్టిన భారీ నిరసన ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, మహిళా సాధికారత పట్ల కాంగ్రెస్, ఇతర విపక్షాల కపట నాటకాలు […]

దొంగ బాబా అశోక్ ఖరాత్ కేసులో బిగ్ ట్విస్ట్

తాంత్రిక పూజల పేరుతో పలువురు మహిళలను లైంగికంగా లోబర్చుకున్నారనే ఆరోపణలతో అశోక్ ఖరాత్ అరెస్టైన సంగతి తెలిసిందే. అశోక్ అత్యంత సన్నిహితుడు జితేంద్ర శెల్కే(55) హఠాన్మరణం చెందాడు. అయితే ఈ మృతిపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. శుక్రవారం కుటుంబంతో కలిసి జితేంద్ర శెల్కే తన వాహనంలో థానే ఎక్స్ప్రెస్ వేపై వెళ్తున్నారు. ఆ టైంలో ధోత్రే గ్రామం వద్ద కారు ఓ కంటైనర్ ట్రక్ను ఢీకొట్టింది. ఈ ఘటనలో జితేంద్ర, ఆయన సతీమణి అనురాధా అక్కడికక్కడే మరణించారు. […]

కేంద్ర ప్ర‌భుత్వ ఉద్యోగుల డీఏ 2 శాతం పెంపు

కేంద్ర ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు శుభ‌వార్త‌. క‌రువు భ‌త్యాన్న కేంద్రం పెంచింది. ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు డీఏను 2 శాతం పెంచిన‌ట్లు కేంద్రం ప్ర‌క‌టించింది. 2026, జ‌న‌వ‌రి ఒక‌టో తేదీ నుంచి పెంచిన డీఏ అమ‌లులోకి వ‌స్తుంది. ఉద్యోగుల‌కు, పెన్ష‌న‌ర్ల‌కు గ‌డిచిన నెల‌ల‌కు సంబంధించిన ఎరియ‌ర్స్ కూడా అంద‌నున్నాయి. గ‌త డీఏ రేటు.. బేసిక్ జీతంపై 58 శాతంగా ఉండేది. ఇప్పుడు పెంచిన డీఏతో అది 60 శాతం అవుతుంది. ప్ర‌స్తుతం ద్ర‌వ్యోల్బ‌ణ ప‌రిస్థితుల నేప‌థ్యంలో డీఏ పెంచ‌డం.. కొంత […]

నైట్ ప్యాంటుతో ఆఫీసుకా? అసిస్టెంట్‌ను సస్పెండ్ చేసిన కలెక్టర్

బాపట్ల పట్టణంలోని 5వ వార్డు సచివాలయాన్ని కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించారు. అక్కడ విధుల్లో ఉన్న డిజిటల్ అసిస్టెంట్ డ్రెస్‌కోడ్ పాటించకుండా, నైట్ ప్యాంటు ధరించి ఆఫీసులో ఉండటం చూసి కలెక్టర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ కార్యాలయానికి వచ్చేటప్పుడు పాటించాల్సిన కనీస నిబంధనలను విస్మరించడం సహించేది లేదని స్పష్టం చేస్తూ, సదరు ఉద్యోగిని తక్షణమే సస్పెండ్ చేయాలని ఆదేశించారు. ఆ సచివాలయంలో 11 అర్జీలు గడువు ముగిసినా పెండింగ్‌లో ఉండటంపై కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON