యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) ఆధ్వర్యంలో నిర్వహించిన నేషనల్ డిఫెన్స్ అకాడమి, కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ (I) 2026కు సంబంధించిన ప్రొవిజనల్ ఆన్సర్ కీలను యూపీఎస్సీ విడుదల చేసింది. గతంలో తుది ఫలితాల విడుదల తర్వాత మాత్రమే ఆన్సర్ కీలను యూపీఎస్సీ విడుదల చేసేది. అయితే పారదర్శకత కోసం ఈ ఏడాది నుంచి పరీక్ష జరిగిన కొద్ది రోజుల్లోనే ఆన్సర్ కీలను అందుబాటులో ఉంచింది. ప్రాథమిక ఆన్సర్ కీలో ఏవైనా తప్పులు ఉంటే ఏప్రిల్ 22లోపు అభ్యంతరాలను తెలిపే అవకాశం కల్పించింది.

