ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర కొత్త ఎన్నికల కమిషనర్ (SEC)గా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి అనిల్‌చంద్ర పునేఠా నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలకు గవర్నర్ ఆమోదముద్ర వేయడంతో, ప్రభుత్వం అధికారికంగా నోటిఫికేషన్ విడుదల చేసింది. 2018-19 కాలంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వ హయాంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. రాష్ట్రంలో త్వరలోనే మున్సిపల్, పంచాయతీ ఎన్నికలు జరగాల్సి ఉన్నాయి. ఈ సమయంలో అనిల్‌చంద్ర పునేఠా నియామకం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.

