కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. కరువు భత్యాన్న కేంద్రం పెంచింది. ప్రభుత్వ ఉద్యోగులకు డీఏను 2 శాతం పెంచినట్లు కేంద్రం ప్రకటించింది. 2026, జనవరి ఒకటో తేదీ నుంచి పెంచిన డీఏ అమలులోకి వస్తుంది. ఉద్యోగులకు, పెన్షనర్లకు గడిచిన నెలలకు సంబంధించిన ఎరియర్స్ కూడా అందనున్నాయి. గత డీఏ రేటు.. బేసిక్ జీతంపై 58 శాతంగా ఉండేది. ఇప్పుడు పెంచిన డీఏతో అది 60 శాతం అవుతుంది. ప్రస్తుతం ద్రవ్యోల్బణ పరిస్థితుల నేపథ్యంలో డీఏ పెంచడం.. కొంత ఊరటనిచ్చే అంశమే.

